
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో మిస్టర్ పర్ఫెక్ట్ ఒకటి. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌ను గాడిలో పెట్టింది. దశరథ్ దర్శకత్వలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కథ కాపీ అంటూ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత్రి శ్యామలా దేవి రాసిన నా మనసు కోరింది నిన్నే నవల ఆధారంగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను తెరకెక్కించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇదే విషయమై శ్యామలా దేవి 2017లో కోర్టును ఆశ్రయించారు. తాజా సమాచారం ప్రకారం కోర్టు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాపీయే అని తేల్చినట్టుగా తెలుస్తోంది. ఈ వివాదంపై స్పందించిన శ్యామలా దేవి, తనకు కోర్టులో తేల్చుకునే ఆలోచన లేదని, నిర్మాత దిల్ రాజును సంప్రదించే ప్రయత్నం చేసినా ఆయన స్పందించకపోవటంతో తప్పని సరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వెల్లడించారు. దర్శకుడు దశరథ్ వర్షన్ మరోలా ఉంది. తాను ఈ కథను 2009లోనే రైటర్స్ అసోషియేషన్‌లో రిజిస్టర్ చేయించానని, శ్యామల దేవి నవల 2010 ఆగస్టులో పబ్లిష్ అయ్యిందన్నారు.