ఈసారి చిరంజీవి హోస్ట్‌! | Class of 80s reunion in hyderabad | Sakshi
Sakshi News home page

ఈసారి చిరంజీవి హోస్ట్‌!

Oct 25 2019 6:04 AM | Updated on Oct 25 2019 10:20 AM

Class of 80s reunion in hyderabad - Sakshi

చిరంజీవి

‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’... 1980లో నటించిన స్టార్స్‌ పెట్టుకున్న పేరు ఇది. ప్రతీ ఏడాది ఒక చోట కలుస్తూ రీయూనియన్‌ జరుపుకుంటారు అప్పటి హీరో హీరోయిన్లు. ఇందులో మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్,  వీకే నరేశ్, అర్జున్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, ప్రభు, సుమలత, శోభన, సుహాసిని, రాధిక, భాగ్యరాజ్, ఖుష్భూ, శరత్‌కుమార్, సత్యరాజ్, జయరామ్, నదియా, సుమన్‌ వంటి స్టార్స్‌ ఉన్నారు. కలిసిన ప్రతిసారి ఆ పార్టీకి ఓ డ్రెస్‌ కోడ్‌ ఏర్పాటు చేసుకుంటారు.

అలాగే ఒక్కో సంవత్సరం ఒక్కో చోట రీ యూనియన్‌ ప్లాన్‌ చేస్తుంటారు. దాంతో పాటు టీమ్‌లో ఉన్న ఓ స్టార్‌ అందరికీ పార్టీ ఇస్తుంటారు. ఈ సంవత్సరం ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ పదో యానివర్శరీ. టెన్త్‌ యానివర్శరీ పార్టీ హైదరాబాద్‌లో చిరంజీవి స్వగృహంలో జరగనుందని తెలిసింది. ఇటీవలే చిరంజీవి తన నివాసాన్ని కొత్త హంగులతో రీ మోడలింగ్‌ చేయించారు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో కొత్తగా తయారైన ఇంట్లో వేడుక కూడా చేశారు. ఇక రీ–యూనియన్‌కి ఈసారి ఈ ఇల్లే వేదిక అయింది. వచ్చే నెలలో ఈ పార్టీ జరగనుంది. హోస్ట్‌గా ఈ పార్టీని బాగా చేయడానికి చిరంజీవి ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement