ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా: చిరంజీవి

Chiranjeevi Launched Kousalya Krishnamurthy Movie Teaser - Sakshi

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి' ది క్రికెటర్‌ అనేది టాగ్‌లైన్‌. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌తోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ.. ‘క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మా కె.ఎస్‌. రామారావు నిర్మాణ సారథ్యంలో మిత్రుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి'. ఇది క్రికెట్‌ నేపథ్యంలో వస్తోన్న విబిన్న కథాంశమిది. స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మూవీస్‌కి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు. నేషనల్‌ వైడ్‌గా స్పోర్ట్స్‌ నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించాయి. గేమ్స్‌కి అంతటి ప్రాధాన్యత ఉంది. దాని బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి'. ఇందులో హీరోయిన్‌గా చేసిన ఐశ్యర్యా రాజేష్‌.. సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఒక ఉమెన్‌ క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే పాత్రలో ఆ అమ్మాయి చక్కగా ఒదిగిపోయింది.

అతడి​కి ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది
క్రికెటర్‌ క్యారెక్టర్‌కి జస్టిఫై చేయడానికి నాలుగైదు నెలల పాటు శిక్షణ తీసుకుంది అంటే ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్‌, శ్రద్ధాసక్తులు, పడిన కష్టం తెలుస్తోంది. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్‌ రావడం అన్నది శుభపరిణామం. నేను ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. స్వాగతం పలుకుతున్నాను. నాకు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుంది. కమర్షియల్‌తో పాటు మంచి ఇతివృత్తాలను తీసుకునే తెరకెక్కించే భీమనేని శ్రీనివాసరావుకి ఇది ఒక మైలుస్టోన్‌ మూవీగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ప్రతి ఒక్క యూనిట్‌ సభ్యునికి హృదయపూర్వక శుభాకాంక్షలు' అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, ప్రొడ్యూసర్‌ కెఎస్‌ రామారావు, పలువురు నటీనటులు తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top