చూడముచ్చటగా 'చేసామ్‌' రిసెప్షన్‌.. ఫొటోలు!

chaysam reception photos - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత నెలలో పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత రిసెప్షన్‌ ఆదివారం మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్కినేని నాగార్జున, అమల, అఖిల్‌, వెంకటేశ్‌, రానా ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. చిరంజీవి, కృష్ణంరాజు, రాంచరణ్‌, అల్లు అర్జున్‌, నాని, అల్లరి నరేశ్‌, వరుణ్‌ తేజ్‌, మురళీమోహన్‌, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి, కొరటాల శివ, రాశీ ఖన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన సినీ ప్రముఖుల ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేడుకలో చూడముచ్చటగా ఉన్న చేసామ్‌ జంట.. వారి మధ్య ఉన్న అన్యోన్యమైన ప్రేమను చాటుతున్న ఫొటోలు, వీడియోలు ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Back to Top