ప్రేక్షకులకు థ్రిల్ | Charusheela Movie Promotional Song | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులకు థ్రిల్

Aug 30 2016 11:46 PM | Updated on Sep 4 2017 11:35 AM

ప్రేక్షకులకు థ్రిల్

ప్రేక్షకులకు థ్రిల్

సీనియర్ దర్శకుడు వి.సాగర్ నిర్మాతగా మారారు. తమ్ముడైన సీనియర్ కెమెరామన్ శ్రీనివాసరెడ్డి వుయ్యూరుని

 సీనియర్ దర్శకుడు వి.సాగర్ నిర్మాతగా మారారు. తమ్ముడైన సీనియర్ కెమెరామన్ శ్రీనివాసరెడ్డి వుయ్యూరుని దర్శకునిగా పరిచయం చేస్తూ జోత్న్స ఫిలిమ్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘చారుశీల’. బ్రహ్మానందం, రేష్మి, రాజీవ్ కనకాల, జశ్వంత్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్‌ను బ్రహ్మానందం, టీజర్‌ను రాజీవ్ కనకాల విడుదల చేశారు. సాగర్ మాట్లాడుతూ- ‘‘థ్రిల్లర్ కథాంశంతో సాగే చిత్రమిది.
 
  1990లో స్టీఫెన్ కింగ్ రాసిన ‘మిజరీ’ నవల ఆధారంగా తెరకెక్కించాం. అన్ని భాషల్లో తీయగల యూనివర్సల్ కథాంశమిది’’ అన్నారు. ఈ చిత్రం తాము హక్కులు కొన్న తమిళ ‘జూలీ గణపతి’కి ఫ్రీమేకంటూ కొందరు కోర్టుకెక్కారు. ఈ వివాదంపై మాట్లా డుతూ, ‘‘చిత్రానికి ఉన్న అడ్డంకులు కోర్టు తీర్పుతో తొలగి పోయాయి. సెప్టెంబర్‌లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొ న్నారు. ‘‘ఈ చిత్రంలో ఓ మంచి పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అని బ్రహ్మానందం అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement