‘చంద్రముఖి’ తరహాలో... | Chandrika Movie Audio Released | Sakshi
Sakshi News home page

‘చంద్రముఖి’ తరహాలో...

Jul 21 2015 11:17 PM | Updated on Sep 3 2017 5:54 AM

‘చంద్రముఖి’ తరహాలో...

‘చంద్రముఖి’ తరహాలో...

ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే అనూహ్యమైన సంఘటనల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘చంద్రిక’. కార్తీక్ జయరామ్,

ఇంట్లో భార్యాభర్తల మధ్య జరిగే అనూహ్యమైన సంఘటనల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘చంద్రిక’. కార్తీక్ జయరామ్, కామ్నా జెఠ్మలానీ, శ్రీముఖి ముఖ్యతారలుగా తెలుగు, కన్నడ భాషల్లో ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి ఆశ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యోగేశ్ మునియప్ప దర్శకుడు. గుణ్వంత్ సేన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన కథాకథనాలతో రూపొందుతో న్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఈ ‘చంద్రిక’ ఎవరనేది తెరపై చూస్తేనే ఆసక్తి గొలుపుతుంది’’ అని చెప్పారు. ‘‘నా కెరీర్‌లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ‘దిబెస్ట్’గా నిలిచే చిత్రం ఇది. నా పాత్రతో పాటు శ్రీముఖి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ‘చంద్రముఖి’ తరహాలో చిరకాలం ఈ చిత్రం గుర్తుండిపోతుంది’’ అని కథానాయిక కామ్నా జెఠ్మలానీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement