క్యాప్షన్‌కు పోస్టర్ పట్టదు! | C/O GODAVARI Movie Audio launch | Sakshi
Sakshi News home page

క్యాప్షన్‌కు పోస్టర్ పట్టదు!

Nov 18 2016 11:07 PM | Updated on Sep 4 2017 8:27 PM

క్యాప్షన్‌కు పోస్టర్ పట్టదు!

క్యాప్షన్‌కు పోస్టర్ పట్టదు!

రచయిత రాజా రామ్మోహన్ దర్శకునిగా మారి ‘‘c/o గోదావరి’ చిత్రాన్ని తెరకెక్కించారు.

రచయిత రాజా రామ్మోహన్ దర్శకునిగా మారి ‘‘c/o గోదావరి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ పట్టదండోయ్’ అన్నది ఉపశీర్షిక. రోహిత్ ఎస్, శ్రుతీవర్మ, దేదీప్య నాయుడు హీరో హీరోయిన్లు. ఉషా మూవీస్ సమర్పణలో తూము రామారావు (బాబాయ్), బొమ్మన సుబ్బారాయుడు, రాజేష్ రంబాల నిర్మించారు.

రఘు కుంచె స్వరపరచిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలయ్యాయి. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉంటాయి’’ అన్నారు. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నిర్మాతలు మల్కాపురం శివకుమార్, సురేశ్, కన్నా లక్ష్మీనారాయణ, ఆకెళ్ల రాఘవేంద్ర, రవీందర్, దేవీప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement