దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

C Kalyan Panel Defeats Dil Raju Group in Film Chamber Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు ఫిలిం చాంబర్‌ ఎన్నికలు ముగిశాయి. దిల్ రాజు, సీ కల్యాణ్ వర్గాలు పోటాపోటీగా తలపడిన ఈ ఎన్నికల్లో సీ కల్యాణ్ వర్గం పైచేయి సాధించింది. సీ కల్యాణ్‌, ప్రసన్నలు నేతృత్వం వహిస్తున్న మన ప్యానల్‌ ఈసీ మెంబర్స్‌తో పాటు సెక్టార్‌ మెంబర్స్‌ను కూడా పెద్ద సంఖ్యలో గెలిపించుకోని ఘనవిజయం సాధించింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌ ప్యానల్‌ విజయం సాధించకపోయినా ఆ ప్యానల్ నుంచి దిల్ రాజు, దామోదర ప్రసాద్‌లు ఈసీ సభ్యులుగా విజయం సాధించారు.

12 మంది ఈసీ మెంబర్‌లలో 9 మంది సీ కల్యాణ్ నేతృత్వంలోని మన ప్యానెల్ నుంచి గెలుపొందగా, ఇద్దరు దిల్ రాజు సారధ్యంలోని యాక్టివ్ ప్యానల్ నుంచి విజయం సాధించారు. మోహన్‌ గౌడ్‌ ఇండిపెండెంట్‌గా పోటి చేసి విజయం సాధిం‍చారు. 20 మంది సెక్టార్ మెంబర్స్‌లో 16 మంది మన ప్యానల్‌ నుంచి విజయం సాధించగా, నలుగురు యాక్టివ్ ప్యానల్ నుంచి గెలుపొందారు.

ఫిలిం చాంబర్‌లో నిర్మాతలు, స్టూడియో యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భాగస్వాములుగా ఉన్నారు. నాలుగు విభాగాల్లో ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఒక్కో విభాగం నుంచి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎగ్జిబిటర్స్‌ విభాగం నుంచి నారాయణ దాస్‌ నారంగ్‌ను ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రెసిడెంట్‌:  నారాయణ్‌దాస్‌ నారంగ్‌
వైస్‌ ప్రెసిడెంట్లు           :  దిల్‌ రాజు, ముత్యాల రామదాసు
సెక్రటరీ                     :  దామోదర్‌ ప్రసాద్‌
జాయింట్‌ సెక్రటరీ        :  నట్టికుమార్‌, భరత్‌ చౌదరి
ట్రెజరర్‌                     :  విజయేందర్‌ రెడ్డి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top