ఒక్కసారి కూడా ‘ఆమె’ బిగ్‌బాస్‌ విన్నర్‌ కాలేదా?

Bigg Boss 3 Telugu: Result Indicates Sexism Exist Says Anchor Jhansi - Sakshi

తెలుగువారిని ఎంతగానో అలరించిన బిగ్‌బాస్‌ 3 ముగిసినప్పటికీ దానిచుట్టూ వివాదాలు మాత్రం వదలడంలేదు. ప్రేక్షకులు కురిపించిన ఓట్ల వర్షంతో అంచనాలు తలకిందులు చేస్తూ రాహుల్‌ సిప్లిగంజ్‌ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ‘గత రెండు సీజన్లలో పురుష కంటెస్టెంట్లకే టైటిల్‌ దక్కింది.. ఈసారి మహిళకు అవకాశమిద్దాం’ అని శ్రీముఖి అభిమానులు చేసిన ప్రచారాన్ని ఎవరూ లెక్కచేయలేదు. ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌లో శ్రీముఖి ఓ సందర్భంలో.. ‘నేను జెండర్‌ను వాడను’ అని చెప్పింది. అయితే అందుకు భిన్నంగా ఆమె సోషల్‌ మీడియా అకౌంట్‌లో మాత్రం శ్రీముఖి కుటుంబ సభ్యులు #THISTIMEWOMAN అంటూ ప్రచారం నిర్వహించడం గమనార్హం.

మూడో‘సారీ’
ఇక తెలుగులో బిగ్‌బాస్‌ మూడు సీజన్లు పూర్తి చేసుకోగా ఒక్కసారి కూడా మహిళలు విన్నర్‌గా నిలవలేకపోయారు. టాప్‌ 5లో చోటు దక్కించుకుని ఫినాలేలో అడుగుపెట్టినా.. వట్టిచేతులతోనే వెనుదిరిగారు. ముచ్చటగా మూడోసారి.. కూడా మేల్‌ కంటెస్టెంట్‌ విన్నర్‌గా అవతరించాడు. టైటిల్‌ ఫేవరెట్‌ అనుకున్న శ్రీముఖి క్రేజ్‌ రాహుల్‌ నిజాయితీ ముందు తక్కువే అయింది. దీంతో ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకోక తప్పలేదు. ఇక బిగ్‌బాస్‌​ ఫలితంతో శ్రీముఖి అభిమానులు నిరాశలో మునిగిపోగా.. పలువురు సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు.

ప్రేక్షకులు అందుకు సిద్ధంగా లేరు
ప్రముఖ యాంకర్‌ ఝాన్సీ సోషల్‌ మీడియా వేదికగా బిగ్‌బాస్‌ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌ వీక్షకులు మహిళను గెలిపించడానికి సిద్ధంగా లేరని అభిప్రాయపడింది. ‘అమెరికా వంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవటం లేదు. అలాంటిది తెలుగు ప్రేక్షకులు మాత్రం బిగ్‌బాస్‌ విన్నర్‌గా మహిళను ఎందుకు గెలిపిస్తారు?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది. లింగభేదం ఇంకా ఉనికిలోనే ఉందంటూ కామెంట్‌ చేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి తన బెస్ట్‌ ఇచ్చిందని ఝాన్సీ ప్రశంసలు కురిపించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top