పునర్నవి ఎలిమినేషన్‌.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్‌

Bigg Boss 3 Telugu: Punarnavi Bhupalam Eliminated - Sakshi

ఊహించినట్టుగానే జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన లీకులు ఈసారి కూడా నిజమయ్యాయి. పదకొండో వారం బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి పునర్నవి భూపాలం ఎలిమినేట్‌ అయింది. ఈవారం రాహుల్‌, వరుణ్‌, పునర్నవి, మహేష్‌లు నామినేట్‌ కాగా..  తొలుత డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని ప్రచారం జరిగింది. మహేశ్‌ విట్టాతో పాటు మరొకరు కూడా హౌజ్‌లో నుంచి వెళ్లిపోతున్నట్టు లీక్‌లు వచ్చాయి. అయితే, అలా జరగలేదు. పునర్నవి మాత్రమే ఎలిమినేట్‌ అయింది. ఇక పునర్నవి ఎలిమినేట్‌ కావడంతో రాహుల్‌ వెక్కివెక్కి ఏడ్చాడు.

హౌజ్‌ నుంచి బయటికొచ్చిన పునర్నవి బిగ్‌బాస్‌లో తన జర్నీకి సంబంధించిన వీడియోను చూసి.. ఎమోషనల్ అయింది. పునర్నవి కోసం రాహుల్ ఒక పాట పాడాలంటూ హోస్ట్‌ నాగార్జున అడగ్గా.. పాడేందుకు అతను ప్రయత్నించాడు. అయితే, దుఃఖం ఆపుకోలేకపోయాడు. దీంతో పాట సాగలేదు. ఏడుపు ఆపుకుంటూ మళ్లీ పాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో బిగ్‌బాసే వెళ్లిపోమాకే.. అనే పాట ప్లే చేశాడు.

ఇక ఎలిమినేట్‌ అయిన పునర్నవిని మిగతా కంటెస్టెంట్లలో ఒకరిని మాస్టర్‌గా.. ఇంకొకరిని వారికి సేవకుడిగా బిగ్‌బాంబ్‌ వేయాలని నాగార్జున చెప్పగా.. అలీని మాస్టర్‌గా.. బాబా భాస్కర్‌ను సేవకుడిగా బిగ్ బాంబ్‌ వేసింది. దీంతో వచ్చే వారం అంతా.. అలీ చెప్పినట్టుగా బాబా వింటాడని హోస్ట్‌ నాగార్జున తెలిపాడు. చివరగా హౌస్ మేట్స్‌కు పంచ్ లేదా హగ్ ఇవ్వాలనే టాస్క్‌ను పునర్నవికి ఇవ్వగా.. సరిగా స్టాండ్ తీసుకోవాలంటూ మహేష్‌కు పంచ్, తనలా తాను ఉండాలని బాబాకు లిటిల్ పంచ్..మిగతా వారందరికీ పునర్నవి హగ్ ఇచ్చింది. వరుణ్‌కు హగ్ తో పాటు కిస్ కూడా ఇచ్చింది. అందరినీ ఈజీగా నమ్మొద్దని సలహా ఇచ్చింది.

ఇక ఆదివారం ఎపిసోడ్‌లో నవరాత్రి వేడుకల సందర్బంగా హౌస్‌మేట్స్‌ నవరసాలను ప్రదర్శించారు దీంతో సండే కాస్తా ఫన్‌డే అయింది. వరుణ్‌ శాంత రసం, పునర్నవి శృంగార రసం, రాహుల్‌ భయాందోళన, శివజ్యోతి కరుణ, బాబా భాస్కర్‌ బీభత్సం, శ్రీముఖి రౌద్రం, మహేశ్‌ హాస్యం, అలీ వీరం, వితిక అద్భుత రసం పండించారు. అయిగిరి నందిని పాటకు శ్రీముఖి, కాంచన సినిమాలోని పాటకు బాబా భాస్కర్, ముత్యాలు వస్తావా పాటకు మహేష్ ప్రదర్శన అదిరిపోయింది. ఈ టాస్క్‌లో వీరి నటనే హైలెట్ గా నిలిచింది. వీరందరికీ వందకు వంద మార్కులు వచ్చాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top