సాధించా, నా జీవితానికి ఇది చాలు: శ్రీముఖి

Bigg Boss 3 Telugu: Look At The Journey Of Ali Reza, Srimukhi - Sakshi

బిగ్‌బాస్‌ షో తుది ఘట్టానికి చేరుకుంది. 15 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్‌ షోలో మరో రెండు వైల్డ్‌ కార్డులు వచ్చి చేరగా ప్రస్తుతం ఇంట్లో అయిదుగురు మాత్రమే మిగిలారు. బిగ్‌బాస్‌ వందరోజుల ప్రయాణాన్ని ఇంటి సభ్యులకు కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఆటుపోట్లు, ఆటపాటలు, గొడవలు, గిల్లికజ్జాలు అన్నింటితో మిళితమైన జర్నీ వీడియోలు చూశాక ఇంటి సభ్యులు తెలీని ఫీలింగ్‌లో ఉండిపోయారు. ఇప్పటికే రాహుల్‌, వరుణ్‌, బాబా తమ జర్నీ చూసి ఎమోషనల్‌ అయ్యారు. తాజా ఎపిసోడ్‌లో శ్రీముఖి, అలీకి బిగ్‌బాస్‌ జర్నీ వీడియోను చూపించాడు. దానికన్నా ముందు వారి ఆటతీరును, సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను ప్రస్తావించాడు.

శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు ‘బిగ్‌బాస్‌’
‘శ్రీముఖి బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టకముందు తెరపై మాత్రమే చూసి అభిమానులుగా మారారు. కానీ ఈ ప్రయాణం శ్రీముఖిని ప్రతీ ఒక్కరి ఇంట్లో అమ్మాయిగా మార్చింద’ని బిగ్‌బాస్‌ తెలిపాడు. ‘ఎప్పుడూ అల్లరిగా ఆడుతూ పాడుతూ ఉండే శ్రీముఖిని ప్రేక్షకులు ఎక్కువగా ప్రేమించార’ని బిగ్‌బాస్‌ ప్రశంసించాడు. దీంతో శ్రీముఖి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. జీవితానికి ఇది చాలు అని సంతోషం వ్యక్తం చేసింది. ఎంతో కొంత సాధించానన్న ఫీలింగ్‌ కలిగిందని ఆనందంతో తేలియాడింది. తన జీవితంలోనే ఇవి మధుర క్షణాలు అని పేర్కొంది. అనంతరం అలీ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లాడు. ఆటలో దూకుడు, ప్రతీ టాస్క్‌లో చూపించిన శ్రద్ధే అలీని ఇక్కడివరకు తీసుకువచ్చాయని బిగ్‌బాస్‌ పేర్కొన్నాడు.


యంగ్‌స్టార్‌ బిరుదు దక్కించుకున్న అలీ రెజా
‘టాస్క్‌ల్లో ఉత్సాహం వల్ల కొన్నిసార్లు శిక్ష అనుభవించారు. కానీ ప్రేక్షకులు మాత్రం మిమ్మల్ని అభిమానిస్తూ వచ్చారు. మీరు రెండోసారి ఇంట్లోకి వచ్చినపుడు పరిస్థితులు, మనుషులు అన్నీ మారిపోయాయి’ అని చెప్తూ అలీకి జర్నీ వీడియోను చూపించాడు. అతనికి ‘యంగ్‌ స్టార్‌’ అంటూ బిరుదు కూడా ఇచ్చేశాడు. ఎమోషనల్‌ అయిన అలీ.. రీఎంట్రీ అవకాశాన్నిచ్చిన బిగ్‌బాస్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తన జీవితాంతం బిగ్‌బాస్‌ జర్నీ గుర్తుండిపోతుందన్నాడు. అనంతరం ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ సీజన్‌తోపాటు ఇంటి గురించి సైతం యాడ్స్‌ చేయమని ఆదేశించాడు. ఈ టాస్క్‌లో హౌస్‌మేట్స్‌ రెచ్చిపోతూ ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top