అదిరిపోయిన ‘భీష్మ’ ట్రైలర్‌

Bheeshma Theatrical Trailer Out - Sakshi

‘దుర్యోధనుడు, దుశ్శాసన, ధర్మరాజ్‌, యమధర్మ రాజ్‌, శని, శకుని పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు ఎందుకు పెట్టారు నాకు’  అని తెగ ఫీలైపోతున్నాడు హీరో నితిన్‌. ఆయన హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌, టీజర్‌, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. తాజాగా విడుదలయిన ట్రైలర్‌ మరింత ఆకట్టుకునేలా ఉంది. 

(చదవండి : ఘనంగా హీరో నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌)

 ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్టు అర్థమైపోతోంది.‘దుర్యోధన్, దుశ్శాసన, ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు’ అనే నితిన్‌ డైలాగుతో ట్రైలర్ మొదలైంది. వెన్నెల కిషోర్ కామెడీ పంచ్‌లు, రష్మీకతో నితిల్‌ రోమాన్స్‌ తరవాత అసలు కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందో చూపించారు.

(చదవండి : ‘సరాసరి గుండెల్లో దించావె..’)

ఈ సినిమా కథ సేంద్రీయ వ్యవసాయం చుట్టూ తిరుగుతుందని అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో విలన్‌గా బెంగాల్ నటుడు జిషు సేన్‌గుప్తా నటించారు. ఈయన ఎరువుల తయారీ కంపెనీకి యజమాని. జిషు, నితిన్ మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ‘నువ్వు ఎన్ని నెలల్లో పుట్టావ్? ఆరు నెలల్లో పుడితే నిన్ను ఏమంటారో తెలుసా? నెల తక్కువ వెధవ అంటారు’ అంటూ జిషుతో నితిన్ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. ‘బలవంతుడితో పోరాడి గెలవచ్చు.. అదృష్టవంతుడితో గెలవలేం’ అని విలన్ చెప్పే డైలాగ్‌ బాగుంది. చివరిగా ‘యు టచ్ మి ఐ పోక్ యు.. యు పోక్ మి ఐ స్క్రాచ్ యు’అని నితిన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ను ముగించారు.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top