ఆగిపోలేదు

bharateeyudu 2 shootings starts from restarted on june - Sakshi

శంకర్‌ – కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో ‘భారతీయుడు 2’ స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కారణంగా షూటింగ్‌కి కొన్ని రోజులు గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత బడ్జెట్‌ ప్రాబ్లమ్‌తో సినిమాను ఆపేస్తున్నారని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా ఆగిపోలేదని కోలీవుడ్‌ సమాచారం.  కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ని రూపొందిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. బడ్జెట్‌ డిస్కషన్, ఇతర కారణాల వల్ల శంకర్‌ ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారనే ప్రచారం జరిగింది. తాజాగా ‘భారతీయుడు 2’ ప్రాబ్లమ్స్‌ అన్నీ క్లియర్‌ అయిపోయాని తెలిసింది. జూన్‌లో తిరిగి షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌ అవుతుందట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top