ఆ హీరో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ | Sakshi
Sakshi News home page

ఆ హీరో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్

Published Sun, Oct 2 2016 1:21 PM

ఆ హీరో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాకు ఇప్పుడు మంచి మిత్రుడు దొరికాడన్న సంతోషంలో తేలిపోతోంది. 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలో తన కో స్టార్ అయుష్మాన్ తనకు చాలా దగ్గరి మిత్రుడుగా మారిపోయాడని పరిణీతి తెలిపింది. ఈ 'దమ్ లగాకే హైసా' హీరో ఇటీవల.. పరిణీతి చాలా చక్కగా పాడుతుందని, ఆమె సింగింగ్‌ను ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చని పొగడ్తలతో ముంచెత్తాడు.

దీనిపై పరిణీతి స్పందిస్తూ.. 'అతడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను పాడటం ఎప్పుడు విన్నా సరే అతడు సింగింగ్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకోమంటూ చెబుతుంటాడు. అతడు కూడా గొప్ప గాయకుడు. నేను పాడుతుంటే తాను నాతో పాటు జాయిన్ అవుతాడు. నేను ఎంతలా పాడినా.. నా పాటలకు అడ్డు చెప్పకుండా వినే కో స్టార్ నాకు దొరికాడు' అంటూ ఆయుష్మాన్‌తో తన ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకొచ్చింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement