నాకు అవకాశాలు ఇవ్వాల్సిందే | Asana Zaveri about her chances | Sakshi
Sakshi News home page

నాకు అవకాశాలు ఇవ్వాల్సిందే

Apr 10 2017 3:28 AM | Updated on Sep 5 2017 8:22 AM

నాకు అవకాశాలు ఇవ్వాల్సిందే

నాకు అవకాశాలు ఇవ్వాల్సిందే

ఇప్పుడిక తప్పదు అంటోంది నటి ఆస్నా జవేరి.

ఇప్పుడిక తప్పదు అంటోంది నటి ఆస్నా జవేరి. ఈ జాన గొడవేమిటనేగా మీ ప్రశ్న. హాస్యనటుడు సంతానం కథానాయకుడిగా అవతారమెత్తిన వల్లవనుక్కుమ్‌ పుల్లుం చిత్రంలో ఆయనతో రొమాన్స్‌ చేసి కోలీవుడ్‌కు దిగుమతి అయిన ముంబై భామ ఆస్నా జవేరి. ఆ చిత్ర విజయంతో మరోసారి అదే నటుడితో ఇనిమే ఇప్పడిదాన్‌ చిత్రంలో జత కట్టింది. దీంతో సంతానం సిఫారసు చేస్తున్న నటి, ఆయనతో సన్నిహితంగా ఉంటోందన్న ప్రచారం జోరందుకుంది. అలాంటి వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా సంతానం ఆస్నా జవేరిని దూరంగా పెట్టారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి.

అలా రెండు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించినా ఆస్నాకు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని పొందాలనే పట్టుదలతో ఉన్న ఈ అమ్మడు అందుకు రూట్‌ ఏమిటన్న ఆలోచనలో భాగంగా తనకు తమిళ భాష సమస్యగా మారడంతో కోలీవుడ్‌ పక్కన పెట్టిందన్న అభిప్రాయానికి వచ్చిన ఆస్నా జవేరి తమిళ భాషను స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుందట. ఇప్పుడామె తన భాషా పాండిత్యాన్ని పరిచయం అయిన దర్శకుల వద్ద ప్రదర్శిస్తూ, చూశారా తాను తమిళంలో ఎలా మాట్లాడగలుగుతున్నానో, ఇక తనకు అవకాశాలు ఇవ్వాల్సిందే అంటూ చొరవతోనే గొడవ చేస్తోందట.

ప్రస్తుతం ఆస్నా జవేరి నకుల్‌కు జంటగా బ్రహ్మ.కామ్, ఆరితో నాగేశ్‌ తిరైఅరంగేట్రం చిత్రాలతో పాటు సీవీ.కుమార్‌ సంస్థలో మరో చిత్రం చేస్తూ బిజీగానే ఉందట. అయితే స్టార్‌ హీరోలతో నటించడానికి తనదైన స్టైల్‌లో అవకాశాల వేటలో పడిందట. మొత్తం మీద ఎంతో కాలంగా కోలీవుడ్‌లో నటిస్తున్న చాలా మంది బాలీవుడ్‌ భామలకు ఇప్పటికీ తమిళ భాష మట్లాడలేకపోతున్నారు. ఇటీవలే కోలీవుడ్‌కు వచ్చిన ఆస్నా జవేరి తమిళ భాషను నేర్చుకోవడాన్ని అభినిందించాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement