పారితోషికం కోసం

Aravinda Swamy Sued his Producer Before Release For payment - Sakshi

కోర్టునాశ్రయించిన అరవిందస్వామి

సినిమా: తాను నటించిన చిత్రానికి పారితోషికం కోసం నటుడు అరవిందస్వామి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.  చతురంగవేట్టై చిత్రాన్ని నిర్మించిన నటుడు మనోబాలా  ఆ చిత్రం విజయం సాధించడంతో తాజాగా చతురంగవేట్టై–2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అరవిందస్వామి కథానాయకుడు గానూ, నటి త్రిష కథానాయకిగా నటించారు. నిర్మాణ కార్యక్రామలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని విడుదలకు నిర్మాత మనోబాల సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిత్ర కథానాయకుడు అరవిందస్వామి ఈ చిత్రంలో నటించినందుకు పారితోషికాన్ని నిర్మాత మనోబాలా పూర్తిగా  చెల్లించకపోవడంతో ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు.

అందులో తాను చతురంగవేట్టై చిత్రంలో నటించినందుకు ఆ చిత్ర నిర్మాత మనోబాలా, తనకు రూ.1.79 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. కాబట్టి తనకు రావలసిన రూ.1.79 కోట్లు వడ్డీ సహా చెల్లించేవరకు చతురంగవేట్టై చిత్ర విడుదలపై నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు బుధవారం న్యాయమూర్తి సందర్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. నటుడు అరవిందస్వామి తరఫున హాజరైన న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి చిత్ర నిర్మాత మనోబాలకు నోటీసులు జారీచేయవలసిందిగా ఆదేశిస్తూ ఈ నెల 20వ తేదీలోగా ఆయన బదులు పిటిషన్‌ దాఖలు చేయాలని పేర్కొన్కారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top