డియర్ డాడ్ | Aravind hero the new film | Sakshi
Sakshi News home page

డియర్ డాడ్

Apr 3 2016 11:09 PM | Updated on Sep 3 2017 9:08 PM

డియర్ డాడ్

డియర్ డాడ్

‘రోజా’, ‘బొంబాయి’ చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులనే కాకుండా అటు బాలీవుడ్‌ను కూడా తన వైపు తిప్పుకున్నారు హీరో అరవింద్ .....

‘రోజా’, ‘బొంబాయి’ చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులనే కాకుండా అటు బాలీవుడ్‌ను కూడా తన వైపు తిప్పుకున్నారు హీరో అరవింద్ స్వామి. అప్పట్లో లవర్‌బోయ్‌గా అందరినీ ఆకట్టుకున్న ఆయన తమిళ చిత్రాలతో బిజీ అయిపోవడంతో హిందీ చిత్రాలపై  దృష్టి సారించలేదు. చాలా విరామం తర్వాత ‘కడలి’ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంటరయ్యారు అరవింద్ స్వామి.

తాజాగా ‘తని ఒరువన్’ చిత్రంతో విలన్‌గా న్యూ ఎంట్రీ ఇచ్చారు. అలాగే, పదిహేనేళ్ల తర్వాత బాలీవుడ్ తెరపై కనిపించ డానికి సిద్ధమవుతున్నారు.  ‘రాజా కో రాణీ సే ప్యార్ హో గయా’ తర్వాత ఆయన హిందీలో మళ్లీ నటించలేదు. ఇప్పుడు ‘డియర్ డాడ్’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న చిత్రంలో అరవింద్ స్వామి ఓ 14 ఏళ్ల బాలుడి తండ్రిగా కనిపించనున్నారు. ఓ రోడ్ ట్రిప్‌లో తండ్రీకొడుకులకు మధ్య ఎదురైన అనుభవాల సమాహారంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement