క్యాస్టింగ్‌ కౌచ్‌పై పెదవి విప్పిన అనుష్క

Anushka Shetty Opinion On Casting Couch In Telugu Film Industry - Sakshi

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న అనుష్క శెట్టి.. హీరోలతో సమానంగా పాపులారిటీ, పారితోషికం అందుకుంటున్నారు. తన 15 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. అయితే అనుష్క ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో.. ఆమెపై అంతే స్థాయిలో రూమర్లు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా స్వీటీ పెళ్లిపై అనేక పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న పుకార్లు, వ్యక్తిగత విషయాలపై స్వీటీ పెదవి విప్పారు. (నేనూ ప్రేమలో పడ్డా: అనుష్క)

ఆమె మాట్లాడుతూ.. ‘చిత్ర పరిశ్రమలో రూమర్లు సాధారణం. వాటి కోసం నేనేం చేయలేను. అయితే అలాంటి పుకార్లు ఎందుకు వ్యాప్తి చేస్తారో నాకు అర్థం అవ్వడం లేదు. నా పెళ్లి విషయంలో వచ్చిన పుకార్ల వల్ల నేను మొదట నిరాశపడ్డాను. అయినా ఇలా పుకార్లు సృష్టిస్తున్న వారికి అక్కాచెల్లెల్లు, పిల్లలు ఉండరా’ అని తనపై గాసిప్స్‌ క్రియెట్‌ చేస్తున్న వ్యక్తులపై స్వీటీ విరుచుకుపడ్డారు. అలాగే బ్యాక్ టు బ్యాక్  సినిమా షూటింగ్‌ల వల్ల తీవ్రమైన వెన్నునొప్పికి గురయినట్లు, దాని నుంచి కోలుకోవడానికి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపారు. టీవీ చూడటం, న్యూస్‌ పేపర్‌ చదవడం తనకు అలవాటు లేదని, తన స్నేహితులు పంపిన మెసెజ్‌ల ద్వారా ఈ పుకార్ల గురించి తెలుసుకుంటానని అనుష్క వెల్లడించారు. (అవి నా కుటుంబాన్ని బాధిస్తున్నాయి: అనుష్క)

ముక్కు సూటిగా మాట్లాడతా
ఫిల్మ్‌ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై అనుష్క మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని నేను చెప్పను. కానీ అదృష్టవశాత్తూ నేను ఎప్పుడూ దీన్ని ఎదుర్కోలేదు. నేను ఎప్పుడూ ముక్కుసూటిగా, స్పష్టంగా ఉంటాను. చిత్ర పరిశ్రమలో సులభ మార్గాల ద్వారా రాణించాలా.. లేదా కష్టపడి నిలదొక్కుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి’ అని సూచించారు. ఇక అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాధవన్‌, అంజలి, షాలిని పాండే ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. (చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top