కాలేజీకి వేళాయె | Anupama Parameshwaran to act opposite Atharvaa | Sakshi
Sakshi News home page

కాలేజీకి వేళాయె

Jul 3 2019 2:37 AM | Updated on Jul 3 2019 2:37 AM

Anupama Parameshwaran to act opposite Atharvaa - Sakshi

అనుపమా పరమేశ్వరన్, అధర్వ

కాలేజీకి వెళ్లడానికి బ్యాగ్‌లో బుక్స్‌ సర్దుకుంటున్నారు హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌. రియల్‌ లైఫ్‌లో కాదులెండీ. రీల్‌ లైఫ్‌లో. తమిళ యువ నటుడు అధర్వ హీరోగా కన్నన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయికగా అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. ఈ సినిమాలో ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ కమ్‌ భరతనాట్యం డ్యాన్సర్‌గా నటించనున్నారు అనుపమా పరమేశ్వరన్‌.

హీరో అధర్వ పీహెచ్‌డీ స్కాలర్‌గా పాత్ర చేయనున్నారు. ‘‘ఈ సినిమా షూటింగ్‌ను ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్‌ చేశాం. యూఎస్, ఆస్ట్రేలియాలో మేజర్‌ షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నాం. సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రాన్ని కంప్లీట్‌ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’’ అని దర్శకుడు పేర్కొన్నారు. అనుపమ తమిళంలో చేస్తున్న రెండో చిత్రం ఇది. ఇంతకుముందు ధనుష్‌ ద్విపాత్రాభినయం చేసిన ‘కొడి’ సినిమాలో ఆమె ఒక హీరోయిన్‌గా నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement