చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం

Published Thu, Sep 12 2013 1:09 AM

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం

‘‘చిన్న సినిమాగా విడుదలైన ఈ చి త్రం పెద్ద విజయాన్ని సాధించింది. దర్శకుడు రొటీన్‌గా కాకుండా కొత్తదనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాము అభిరుచిగల నిర్మాత అని మరోసారి నిరూపించుకున్నారు’’ అని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు అభినందించారు. 
 
 సుమంత్ అశ్విన్, ఇషా జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదరప్రసాద్ నిర్మించిన చిత్రం ‘అంతకుముందు... ఆ తర్వాత’. ఇటీవలే విడుదలై విజయం సాధించిన ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. 
 
 నిర్మాత సహకారంతోనే ఈ సినిమా తీయగలిగానని, కల్యాణి కోడూరి సంగీతం ఈ సినిమా విజయాన్ని పై స్థాయికి తీసుకువెళ్లిందని దర్శకుడు తెలిపారు. గత చిత్రాలతో రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చిందని సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా దామోదర ప్రసాద్, సుమంత్ అశ్విన్, ఇషా, శ్రీకృష్ణ తదితరులు మాట్లాడారు.

Advertisement
 
Advertisement
 
Advertisement