మరో స్టార్ వారసుడు.. వచ్చేస్తున్నాడు! | Sakshi
Sakshi News home page

మరో స్టార్ వారసుడు.. వచ్చేస్తున్నాడు!

Published Wed, Jun 8 2016 6:57 PM

మరో స్టార్ వారసుడు.. వచ్చేస్తున్నాడు!

తేజాబ్ లాంటి సినిమాలతో ఒకప్పుడు అగ్రస్థానానికి వెళ్లిన బాలీవుడ్ హీరో అనిల్ కపూర్. ఇప్పటికే ఆయన కూతురు సోనమ్ కపూర్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగొందుతుండగా, ఇప్పుడు ఆయన కొడుకు హర్షవర్ధన్ కపూర్ కూడా హీరోగా వస్తున్నాడు. అతడితో పాటు కొత్త హీరోయిన్ సయామీ ఖేర్ కలిసి నటించిన మొట్టమొదటి సినిమా మిర్జియా. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తీస్తున్న ఈ సినిమా మొదటి టీజర్ ట్రైలర్ బుధవారం  విడుదలైంది.

ఇందులో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకథకు సంబంధించిన కొన్ని చిన్నిచిన్న ఘటనలు కనిపిస్తాయి. చిన్నతనంలో సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఎలా వెళ్తాడో.. పెద్దయ్యాక బైక్ మీద కూడా అచ్చం అలాగే వెళ్లడం లాంటి సీక్వెన్సులు ఈ 1.40 నిమిషాల టీజర్‌లో ఉన్నాయి. దీంతోపాటు తుపాకుల మోతలు.. గుర్రం మీద హీరో వచ్చే జానపద సీన్లు కూడా కనిపిస్తాయి. అక్టోబర్ 7వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంలో ఇంకా ఓంపురి, ఆర్ట్ మాలిక్, కేకే రైనా, అనుజ్ చౌదరి లాంటి వాళ్లు నటిస్తున్నారు. మీర్జా సాహిబా అనే పంజాబీ జానపద చిత్రం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement