ఆనందం స్థాయిలో... | Anandam Malli Modalaindi Movie trailer released | Sakshi
Sakshi News home page

ఆనందం స్థాయిలో...

Feb 1 2015 10:45 PM | Updated on Sep 2 2017 8:38 PM

ఆనందం స్థాయిలో...

ఆనందం స్థాయిలో...

జైఆకాష్ హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఆనందం మళ్లీ మొదలైంది’. నందిత సమర్పణలో ఎన్.జె. రత్నావత్

 జైఆకాష్ హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఆనందం మళ్లీ మొదలైంది’. నందిత సమర్పణలో ఎన్.జె. రత్నావత్ నిర్మించిన ఈ చిత్రంలో ఏంజెల్ సింగ్, జియాఖాన్, అలేఖ్య కథానాయికలు. త్వరలో తెరకు కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆకాష్ మాట్లాడుతూ -‘‘‘స్వీట్ హార్ట్’ చిత్రానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రత్నావత్ మళ్లీ నా దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంది. హీరోగా నాకు మంచి గుర్తింపు తెచ్చిన ‘ఆనందం’ స్థాయిలో ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో సప్తగిరి రెండో హీరోగా నటించారని నిర్మాత చెప్పారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రత్నావత్ బలరామ్, సంగీతదర్శకుడు సుమన్ జూపూడి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement