‌మోకాలి కండరాల నొప్పి బాధిస్తోంది: అమితాబ్‌ | Amitabh Bachchan Finishes Two Days Of Work In One Day | Sakshi
Sakshi News home page

రెండు రోజుల పని ఒక రోజులోనే పూర్తి: అమితాబ్

May 6 2020 7:09 PM | Updated on May 6 2020 7:16 PM

Amitabh Bachchan Finishes Two Days Of Work In One Day - Sakshi

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ బాగా అలిసిపోయారు. ఇందుకు కారణం రెండు రోజులు చేయాల్సిన పనిని కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేయడమే. ఇలా చేయడం ద్వారా ఆయనకు మోకాలి కండరాల నొప్పి కూడా బాధిస్తోందన్నారు. అయిననప్పటికీ అందరి అభిమానంతో షూటింగ్‌ పూర్తి చేయగలిగానని బిగ్‌బీ ట్విటర్‌లో తెలిపారు. ‘ఇప్పుడే పని పూర్తి చేసుకున్నాను. కండరాల నొప్పి భాదిస్తోంది. సోషల్‌ మెసేజింగ్‌ వీడియోలు, త్వరలో రానున్న కేబీసీ(కౌన్‌ బనేగా కరోడ్‌పతి) కొత్త సీజన్‌కు రిజిస్ట్రేషన్‌ పనులు జరుగుతున్నాయి. ఇలా రెండు రోజుల షెడ్యూల్‌ పనులు ఒకే రోజులో పూర్యయ్యాయి ’ అంటూ ట్వీట్‌ చేశారు. బిగ్‌బాస్-2 న‌టికి మళ్లీ అనారోగ్యం

అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సాయంత్రం ఆరు గంటల నుంచి నిర్విరామంగా పనులను కొనసాగాయని, దాదాపు 10 నుంచి 12 వీడియోలు చిత్రీకరించినట్లు అమితాబ్‌ తెలిపారు. ఆడియో రికార్డింగ్‌ తోపాటు పలు అవగాహన, ప్రయోషన్ల పనులు కూడా పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక ఈ పనులన్ని అమితాబ్‌ ఇంటి నుంచి జరగగా.. రిమోట్‌ ద్వారా దంగల్‌ హల్మర్‌ నితేశ్‌ తివారి డైరెక్షన్‌ చేశారు. కాగా బుల్లితెరపై ప్రేక్షకులందరిని అలరిస్తున్న గేమ్‌ షో 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' (కేబీసీ). ఈ కార్యక్రమం త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 11 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తున్న కేబీసీ 12వ సీజన్‌ కోసం ముస్తాబవుతోంది. దీనికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 9 వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం కానున్నట్టు జీ టీవీ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో తెలిపింది. (మద్యం ప్రియులకు భారీ షాక్‌.. )

చదవండి : కరోనా: సింగరేణి 40 కోట్ల విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement