నిఖిల్‌ చిత్రం: అతిథిగా బన్నీ కూతురు | Allu Arha Chief Guest For Nikhil 18 Pages Movie Muhurtham | Sakshi
Sakshi News home page

18 పేజీస్‌: ఆసక్తికరంగా నిఖిల్‌ కొత్త చిత్రం

Mar 5 2020 12:54 PM | Updated on Mar 6 2020 7:56 AM

Allu Arha Chief Guest For Nikhil 18 Pages Movie Muhurtham - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తనయ అల్లు అర్హ అప్పుడే సినిమా లొకేషన్‌కు వచ్చింది. మేకప్‌ వేసుకుని కెమెరాముందుకు రావడానికి ఇంకా సమయం ఉందిలే కానీ ఆమె వచ్చింది నటించడానికి కాదు.. హీరో నిఖిల్‌ కొత్త సినిమా ముహూర్త కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా ట్రెడిషనల్‌గా ముస్తాబై వచ్చిన అర్హ తన అల్లరి చేష్టలతో అందరినీ అలరిస్తోంది. అక్కడే ఉన్న తాత అల్లు అరవింద్‌ దగ్గర గారాలు పోతోంది. పనిలో పనిగా తాతయ్యకు ముద్దుల మూటలు అందిస్తూ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ బుట్టలో వేసుకుంటోంది.

ఇక నిఖిల్‌ సినిమా విషయానికొస్తే ‘18 పేజీస్‌’ అనే కొత్తం చిత్రంలో నటిస్తున్నాడు. ‘కుమారి 21 ఎఫ్‌’ వంటి హిట్‌ సినిమాను అందించిన ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ సినిమాకు సుకుమార్  కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. గోపి సుంద‌ర్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్రబృందం త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది. (నువ్వే అందంగా ఉన్నావు.. కాదు నువ్వే..)

చదవండి: (కన్నతండ్రినే బే అంటున్న అల్లు అర్హ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement