ధూమ్-4తో బాలీవుడ్‌కు అజిత్? | Ajith ideal for Dhoom 4 with Abhishek Bachchan | Sakshi
Sakshi News home page

ధూమ్-4తో బాలీవుడ్‌కు అజిత్?

Nov 25 2013 3:57 AM | Updated on Apr 3 2019 6:23 PM

ధూమ్-4తో బాలీవుడ్‌కు అజిత్? - Sakshi

ధూమ్-4తో బాలీవుడ్‌కు అజిత్?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేయనున్నారా? అన్న ప్రశ్నకు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేయనున్నారా? అన్న ప్రశ్నకు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ క్రేజీ చిత్రం ధూమ్‌కు రెండో సీక్వెల్ త్వరలో తెరపైకి రానుంది. షారూఖ్‌ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినాకైఫ్ హీరో హీరోయిన్లుగా నటించారు. తదుపరి ధూమ్-4 కూడా తెరకెక్కనున్నట్లు, ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు అజిత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోడంబాక్కం టాక్. అదే విధంగా తాజాగా అజిత్ నటించిన ఆరంభం చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు          సమాచారం. బాలీవుడ్‌లో స్టార్ దర్శకుడిగా ప్రకాశిస్తున్న ప్రభుదేవా ఆరంభం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అందులో అజిత్‌ను హీరోగా నటింపజేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement