ఒసేయ్‌ రాములమ్మా 2 | Ajay Koundinya Director Directs New Movie With The Name Ramulamma 2 | Sakshi
Sakshi News home page

ఒసేయ్‌ రాములమ్మా 2

Jul 22 2020 3:39 AM | Updated on Jul 22 2020 3:39 AM

Ajay Koundinya Director Directs New Movie With The Name Ramulamma 2 - Sakshi

విజయశాంతి లీడ్‌ రోల్‌లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒసేయ్‌ రాములమ్మా’. 1997లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే  అదే పేరుతో మరో సినిమా రానుంది. కౌండిన్య ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణలో కనకదుర్గ ఫిలింస్‌ పతాకంపై అజయ్‌ కౌండిన్య స్వీయ దర్శకత్వంలో ‘ఒసేయ్‌ రాములమ్మా 2’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత అజయ్‌ కౌండిన్య మాట్లాడుతూ– ‘‘అద్భుతమైన కథ కథనంతో ‘ఒసేయ్‌ రాములమ్మా 2’ స్క్రిప్ట్‌ సిద్ధం అవుతోంది. నా కథకి ఈ టైటిల్‌  బాగా సరిపోతుంది. కథ, కథనం పర్ఫెక్ట్‌గా కుదరడంతో మంచి నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంటున్నా. అతి త్వరలో షూటింగ్‌ మొదలుపెడతాం’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement