breaking news
Ajay Koundinya
-
ఒకే డైరెక్టర్..ఒకే హీరో..వరుసగా 10 సినిమాలు!
ఒక సినిమా హిట్ అయితే కొన్నాళ్ల తర్వాత ఆ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది. అది కూడా హిట్టయితే మూడోసారి కలిసి చేస్తారు. కానీ ఈ హీరో, డైరెక్టర్లు మాత్రం వరుసగా 10 సినిమాలు కలిసి చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సదరు హీరోనే వెల్లడించారు. అజయ్ కౌండిన్య దర్శకత్వంలో బొంత రాము హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ రాము. ఈ చిత్రంలో అజయ్ ఘోష్ విలన్ గా నటిస్తున్నారు. జబర్దస్త్ అప్పారావు మరో కీ రోల్ పోషించారు. ఈ చిత్రాన్ని రేణుక దేవి ఫిలింస్ బ్యానర్ పై బొంత రాము నిర్మించారు. అజయ్ కౌండిన్య దర్శకత్వం వహించారు. త్వరలో "మిస్టర్ రాము" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్, హీరో బొంత రాము మాట్లాడుతూ - నాకు హీరోగా నటించాలని కల ఉండేది. దర్శకుడు అజయ్ కౌండిన్య నాకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కథ నచ్చి తప్పకుండా చేద్దామని ముందుకు వచ్చాను. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ రోల్ లో నటించాను. మిస్టర్ రాము తో పాటు నేను, డైరెక్టర్ అజయ్ కౌండిన్య కాంబినేషన్ లో మరో 9 చిత్రాలు చేయబోతున్నాం. మొత్తం మా కాంబినేషన్ లో 10 సినిమాలు రాబోతున్నాయి. మిస్టర్ రాము సినిమా రిలీజైన వెంటనే మా కొత్త సినిమాను ప్రకటిస్తాం. మాకు సపోర్ట్ చేస్తున్న నా స్నేహితులు, సన్నిహితులు అందరికీ థాంక్స్. అన్నారు.దర్శకుడు అజయ్ కౌండిన్య మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాను మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ అంశాలు కలిపి రూపొందించాం. మా ప్రొడ్యూసర్ రాము ఈ చిత్రంలో హీరోగానూ నటించారు. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. పుష్ప సినిమా విలన్ అజయ్ ఘోష్ మా మీద అభిమానంతో ఈ చిత్రంలో విలన్ గా నటించారు. అలాగే జబర్దస్త్ అప్పారావు అడిగిన వెంటనే నటించేందుకు ఒప్పుకున్నారు. ఆస్పత్రిలో చిన్నపిల్లల కిడ్నాప్స్ నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా రూపకల్పన సమయంలో హీరో, ప్రొడ్యూసర్ రాము దగ్గర నుంచి ఎంతో సపోర్ట్ లభించింది. నేను చిత్ర పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు పడి నిలబడ్డాను. చిన్న చిత్రాలకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండటం లేదు. చిన్న చిత్రాలు కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలి. అలా పేరు తెచ్చుకునే సినిమాల్లో దర్శకుడిగా నా మూవీస్ కూడా ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.నటి అవంతిక మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాలో నేను ఓ స్పెషల్ సాంగ్ చేశాను. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నేను చేసిన స్పెషల్ సాంగ్ కి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.హీరోయిన్ సంధ్య మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాలో డైరెక్టర్ అజయ్ గారు నాకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. నేను ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఆశించానో అలాంటి మంచి క్యారెక్టర్ ఈ చిత్రంలో నాకు దక్కింది. మా మిస్టర్ రాము మూవీని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు -
ఒసేయ్ రాములమ్మా 2
విజయశాంతి లీడ్ రోల్లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒసేయ్ రాములమ్మా’. 1997లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే అదే పేరుతో మరో సినిమా రానుంది. కౌండిన్య ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణలో కనకదుర్గ ఫిలింస్ పతాకంపై అజయ్ కౌండిన్య స్వీయ దర్శకత్వంలో ‘ఒసేయ్ రాములమ్మా 2’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత అజయ్ కౌండిన్య మాట్లాడుతూ– ‘‘అద్భుతమైన కథ కథనంతో ‘ఒసేయ్ రాములమ్మా 2’ స్క్రిప్ట్ సిద్ధం అవుతోంది. నా కథకి ఈ టైటిల్ బాగా సరిపోతుంది. కథ, కథనం పర్ఫెక్ట్గా కుదరడంతో మంచి నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంటున్నా. అతి త్వరలో షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు. -
దర్శకుడు అజయ్ కౌండిన్యపై కేసు
సాక్షి, హైదరాబాద్ : మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన భూత్ బంగళా సినిమా దర్శకుడు అజయ్ కౌండిన్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మల్కాజ్గిరి వసంతపురి కాలనీకి చెందిన శ్రీ లలితా మహిళా మండలి సమితి అధ్యక్షురాలు జిన్నెల సురేఖ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జనవరి 26న ఫిలించాంబర్‌లో జరిగిన భూత్ బంగళా సినిమా ఫంక్షన్లో అజయ్ కౌండిన్య మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటమే కాకుండా 30న ఓ చానెల్ డిబేట్లో కూడా తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ నిరూపిస్తానని సవాల్ విసిరాడన్నారు. అమీర్‌పేట్‌లోని విద్యార్థులు, కొందరు పోలీస్ బాస్‌లు వ్యభిచారులేనని ఆయన చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.