శ్రీ కల్యాణ వెంకన్నను దర్శించుకునేందుకు తిరుమల కొండపైకి వెళ్లిన నటి అనుష్కకు అభిమానులు చుక్కలు చూపించారు.
	తిరుపతి:శ్రీ కల్యాణ వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం తిరుమల కొండపైకి వెళ్లిన నటి అనుష్కకు అభిమానులు చుక్కలు చూపించారు. శనివారం బాహుబలి సినిమా ఆడియో ఫంక్షన్ ను జరుపుకున్న చిత్ర యూనిట్ లోని కొంతమంది సభ్యులు శ్రీవారిని దర్శించుకునేందుకు కొండపైకి పయనమైయ్యారు. ఈ క్రమంలోనే  కొంతదూరం నడకదారిలో దర్శనానికి వెళ్లిన అనుష్కకు అభిమానులు నుంచి తీవ్ర నిరాశే ఎదురైంది. ఆమెను చూసేందుకు అభిమానులు క్యూకట్టడంతో అనుష్క కాస్త అసహనానికి గురైయ్యారు. ఓ దశలో అభిమానులు అదుపుతప్పి అనుష్క మీద పడబోయారు. దీంతో ఆమె విసుక్కుంటూ అతికష్టం మీద ఆలయం వద్దకు కారు ద్వారా చేరుకున్నారు.

	
	
	
	
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
