‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’పేరుతో అక్టోబర్ 31న రీరిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఉండటంతో చాలాచోట్ల థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో రీరిలీజ్ చిత్రాల మొదటిరోజు కలెక్షన్స్ జాబితాలో ఈ మూవీ మొదటి స్థానంలో నిలిచింది. భవిష్యత్లో అంత సులువుగా ఎవరూ అందుకోలేనంత రేంజ్లో సత్తా చాటింది. భారత సినీ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన రీ-రిలీజ్ చిత్రంగా బాహుబలి: ది ఎపిక్ నిలిచింది.
ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో సినిమాలు రీరిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు మొదటిరోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా విజయ్ 'గిల్' రూ. 10 కోట్ల గ్రాస్తో ఉంది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ రూ. 8 కోట్ల గ్రాస్తో ఉంది. ఇప్పుడా రికార్డ్స్ అన్నీ ‘ప్రభాస్’ సినిమా దాటేసింది. ‘బాహుబలి: ది ఎపిక్’ మొదటిరోజే ఏకంగా రూ. 10.4 కోట్ల నెట్ సాధించినట్లు ప్రముఖ ట్రేడింగ్ వెబ్ సైట్ సాక్నిల్క్ పేర్కొంది. అదే గ్రాస్ పరంగా చూస్తే రూ. 18 కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతటి రేంజ్లో కలెక్షన్స్ సాధించిన సినిమా ఏదీ లేదు. ఇలా రీరిలీజ్‌తో బాహుబలి తన మార్క్ ఏంటో మరోసారి ఇండస్ట్రీకి చూపింది.
రీ-రిలీజ్ ఫస్ట్డే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 సినిమాలు
బాహుబలి: ది ఎపిక్- (రూ. 18 కోట్ల గ్రాస్)
గిల్- విజయ్- తమిళ్ (రూ. 10 కోట్ల గ్రాస్)
గబ్బర్ సింగ్ - (రూ. 8 కోట్ల గ్రాస్)
బిజినెస్మేన్- (రూ. 5.27 కోట్ల గ్రాస్)
మురారి - (రూ. 5 కోట్ల గ్రాస్)


