పదేళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'బాహుబలి'ని ఇప్పుడు రీరిలీజ్ చేశారు. రెండు భాగాల్ని కలిపి ఒక్కటిగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వీకెండ్ అయ్యేసరికి ఏకంగా రూ.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. ఇది నిజమైతే మాత్రం రికార్డే. ఎందుకంటే రీ రిలీజ్ మూవీస్‌కి ఈ రేంజు వసూళ్లు ఎప్పుడూ రాలేదు. మరోవైపు ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. 'బాహుబలి' లేకపోతే తాను ఆ సినిమాల్ని తీసేవాడిని కాదని చెబుతున్నా ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'వార్ 2' ఫ్లాప్ దెబ్బకు నిర్మాత షాకింగ్ నిర్ణయం)
ఏంటి విషయం?
'బాహుబలి' సినిమా మన దేశంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. తెలుగు మూవీకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేయడంతో పాటు ఓ కథని రెండు భాగాలుగా కూడా చెప్పొచ్చనే దారిని దర్శకులకు చూపించింది. గతంలో అంటే 2022లో ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఇందులో మాట్లాడిన డైరెక్టర్ మణిరత్నం.. 'బాహుబలి' లేకపోయింటే తాను 'పొన్నియిన్ సెల్వన్' తీసేవాడిని కాదని అన్నారు.
''బాహుబలి' లేకపోతే 'పొన్నియిన్ సెల్వన్' లేదు. రాజమౌళి తన సినిమాను రెండు భాగాలుగా తీయకపోతే నేను ఈ చిత్రాన్ని తీసేవాడిని కాదు. ఇదే విషయాన్ని నేను రాజమౌళిని కలిసినప్పుడు చెప్పాను. రాజమౌళి మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా చేశారు. ఆయన అలా చేయడం వల్లే మేము కూడా ఒక సినిమాను రెండు భాగాలుగా తీయగలిగాం' అని మణిరత్నం చెప్పారు. పాత వీడియోనే అయినప్పటికీ అది ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?)
If Rajamouli hadn’t made #Baahubali, I wouldn’t have made #PonniyinSelvan. He showed that Indian movies can be made on a big scale and still win hearts. Thank you, #Rajamouli, for the inspiration.
:– Director Mani Ratnampic.twitter.com/hJ4CKQvtbo— Milagro Movies (@MilagroMovies) November 3, 2025


