‘జాగ్వర్’ మొదటి టికెట్ రూ.10 లక్షలు ! | 1st ticket of jaguar finds Rs 10-lakh bid | Sakshi
Sakshi News home page

‘జాగ్వర్’ మొదటి టికెట్ రూ.10 లక్షలు !

Sep 27 2016 2:27 AM | Updated on Sep 4 2017 3:05 PM

‘జాగ్వర్’ మొదటి టికెట్ రూ.10 లక్షలు !

‘జాగ్వర్’ మొదటి టికెట్ రూ.10 లక్షలు !

మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి నిర్మాతగా ఆయన తనయుడితో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన జాగ్వార్

సాక్షి ,బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి నిర్మాతగా ఆయన తనయుడితో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన జాగ్వార్ చిత్రంపై శాండల్‌వుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి చిత్రంతో తన నటన, స్టంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో నిఖిల్‌కుమార్ గౌడ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానున్న ఆయన నటించిన జాగ్వార్ చిత్రం టికెట్ల కోసం చిత్ర యూనిట్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో టికెట్ల కోసం అభిమానులు పోటీ పడ్డారు.
 
మైసూరుకు చెందిన లోకేశ్ అనే వ్యక్తి అత్యధికంగా రూ. పది లక్షలకు జాగ్వార్ సినిమా మొదటి టికెట్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చిత్రం విడుదల రోజున టికెట్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి పేరును వెల్లడించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.
 
కాగా కొత్త నటుడి మొదటి చిత్రం టికెట్ కోసం ఇంత పోటీ నెలకొనడం చాలా ఆశ్చర్యంగా ఉందని చిత్ర సహ నిర్మాత ఒకరు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుమారు 16 దేశాలలో వెయ్యికి పైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. అదే విధంగా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయకిగా కొనసాగుతున్న మిల్కీబ్యూటీ తమన్న ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించనుడటం మరో విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement