అది ఈ జనరేషన్‌కు బాగా అలవాటు!

Things You must Avoid When New To Relationship - Sakshi

కొత్త ఒక వింత అన్నది ప్రేమకు కూడా వర్తిస్తుంది. ప్రేమలో పడగానే హార్మోన్ల ప్రభావంతో గాలిలో తేలుతున్నట్లు అన్పించటం, ఇంతకముందు లేని కొత్త ఉత్సాహం, సంతోషం అంతా ఓ పిచ్చిలా ఉంటుంది. కొద్దిగా ఏదైనా తప్పు జరగగానే ఢీలా పడిపోవటమో లేదా భయపడిపోవటమో జరుగుతుంది. కొత్తగా ప్రేమ బంధంలోకి అడుగుపెట్టటం ఒక ఎత్తైతే, ఎదుటి వ్యక్తితో ఏ గొడవలు లేకుండా జీవించటం మరో ఎత్తు. కొత్త బంధంలోకి అడుగుపెట్టగానే ముఖ్యంగా రిలేషన్‌షిప్‌లోని ఈ మూడు విషయాలను మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే కొన్ని విషయాలను అవాయిడ్‌ చేయటం ద్వారా ఇబ్బందికర పరిస్థితులకు స్వప్తి చెప్పవచ్చు. 

1) సెటిల్‌ అ‍వ్వటానికి సిద్దంగా ఉన్నా..
మీరు పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవ్వటానికి సిద్ధంగా ఉండొచ్చు. అయితే కొత్తగా ప్రేమ బంధంలోకి అడుగుపెట్టినపుడు ఈ ఆలోచన రావటం ఒకరకంగా ప్రేమబంధానికి ఎండ్‌కార్డ్‌లాంటిది. రిలేషన్‌లోకి అడుగుపెట్టిన వెంటనే లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలనే ఆలోచన జోలికి వెళ్లకుండా ఆలోచించి అడుగువేయాలి.

2) క్వాలిటీ టైం 
లేడికి లేచిందే పరుగు అన్నట్లు కొత్త బంధాన్ని పరుగులు పెట్టించటం మంచిది కాదు. గంటలు గంటలు చాటింగ్‌లు, ఫోన్‌లో టాకింగ్‌లు, సినిమాలు, షికార్లు, పబ్బులు, క్లబ్బులు అంటూ జెట్‌ స్పీడులో బంధంలో దూసుకుపోవటం ఈ జనరేషన్‌కు బాగా అలవాటు. అయితే భాగస్వామితో ఎంత సమయం గడిపామన్నది కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ఎంత సమయం కేటాయిస్తున్నామన్నదే ముఖ్యం. పెరుగుట విరుగుట కొరకే అన్న సత్యం కొత్త బంధానికి సరిగ్గా సరిపోతుంది. ఎదుటి వ్యక్తితో మనం ఎంత తొందరగా కలిసిపోతామో అంతే తొందరగా గొడవలు పడి విడిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఏదైనా చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

3) మాజీల మీద చర్చ 
మీ భాగస్వామితో కలిసి గడపటానికి సమయం దొరికినపుడు మాజీల గురించిన ప్రసక్తి తీసుకురావద్దు. భవిష్యత్తును గురించి ఆలోచించుకునే సమయంలో గతాన్ని గుర్తుచేసుకోవటం కొత్త బంధానికి మంచిది కాదు. మాజీల గురించి మాట్లాడుకోవటం మొదటికే మోసం తెస్తుంది. మాజీల గురించి చర్చించటానికి ఇది సరైన సమయం కాదని గుర్తించాలి. సరైన సమయం కోసం వేచిచూడాలి.  


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top