అతడిది బట్టతల.. అందమైన అమ్మాయి కావాలి

Ondu Motteya Kathe Love Movie Review - Sakshi

లవ్‌ సినిమా

సినిమా : ఒందు మొట్టేయ కథె 
తారగణం : రాజ్‌ బి శెట్టి, అమృత నాయక్‌, శ్రేయ అంచన్‌, శైలేశ్‌ శ్రీ ముల్కి
డైరక్టర్‌ : రాజ్‌ బి శెట్టి
భాష : కన్నడ 

కథ : జనార్థన్‌( రాజ్‌ బి శెట్టి) కన్నడ లెక్చరర్‌. అతడి బట్టతల, పుల్లలాంటి రూపం కారణంగా వచ్చిన పెళ్లి సంబంధాలు అన్ని తప్పిపోతుంటాయి. అయినప్పటికి అందమైన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని జనార్థన్‌ నిశ్చయించుకుంటాడు. దానికి తోడు ఓ సంవత్సరంలో పెళ్లి కాకపోతే సన్యాసం తీసుకోవల్సి వస్తుందని ఓ జ్యోతిష్యుడు అతడ్ని భయపెడతాడు. దీంతో తనకు పెళ్లి చూపులు వర్కవుట్‌ అవ్వవని భావించి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తను పనిచేసే కాలేజీలోని తోటి లెక్చరర్‌ను ఆకర్షించటానికి ప్రయత్నించి విఫలమవుతాడు. మరో ప్రయత్నంలో ఓ అందమైన అమ్మాయి చేతిలో భంగపడతాడు. ఇలా అయితే కుదరదనుకుని ఫేస్‌బుక్‌లో తన చిన్నప్పటి క్లాస్‌మేట్‌ సరళ(శైలేశ్‌ శ్రీ ముల్కి) ప్రేమలోకి దించటానికి ట్రై చేస్తాడు.

ఓ రోజు ఇద్దరు పార్కులో కలుసుకుంటారు. సరళ లావుగా ఉండటంతో ఆమెను జనార్థన్‌ అసహ్యించుకుంటాడు. సరళ కూడా మొదట అతడి రూపాన్ని చూసి ఇష్టపడదు. ఆ తర్వాత చోటుచేసుకునే సంఘటనలతో సరళ అతడిని ప్రేమించటం మొదలు పెడుతుంది. జానార్థన్‌కు నచ్చకపోయినా ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిపోతుంది. అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్న జనార్థన్‌ సరళను పెళ్లి చేసుకుంటాడా? సరళతో పెళ్లి క్యాన్సిల్‌  చేసి అందమైన అమ్మాయి కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెడతాడా? లేదా? అన్నదే మిగితా కథ. 

విశ్లేషణ : 2017లో విడుదలైన ‘ఒందు మొట్టేయ కథే’ రొమాంటిక్‌ కామెడీ మూవీ. ఫీల్‌ గుడ్‌ ప్రేమ కథా చిత్రం కాకపోయినా వాస్తవ జీవితాలను అద్దం పట్టే కథాంశం దీని సొంతం. గాల్లో మేడలు కట్టే నేటి యువతరానికి జనార్థన్‌ ప్రతీకగా నిలుస్తాడు. నిజమైన ప్రేమలో బాహ్య సౌందర్యాలకు చోటు లేదని చెప్పే సినిమా. రాజ్‌ బి శెట్టి దర్శకత్వంతో పాటు లీడ్‌ రోల్‌ చేసిన ఈ ఇన్నర్‌ బ్యూటీ కాన్సెప్ట్‌ చిత్రం మనల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

07-12-2019
Dec 07, 2019, 12:02 IST
ఓ జంట మధ్య బంధం ధృడంగా ఉండాలంటే వారి మధ్య చక్కని కమ్యూనికేషన్‌ అవసరం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం...
07-12-2019
Dec 07, 2019, 10:42 IST
నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులవి. కో ఎడ్యుకేషన్ కాలేజి. తడబడుతున్న అడుగులతో క్లాస్ రూమ్‌లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా శరీరమంతా...
06-12-2019
Dec 06, 2019, 16:10 IST
నేను తొమ్మిదవ తరగతిలో ఉండగా ఇంటి ముందు ఉండే అబ్బాయి ప్రపోజ్‌ చేశాడు. ఏమీ తెలియని వయసు.. ఆకర్షణ కారణంగా...
06-12-2019
Dec 06, 2019, 14:41 IST
12 ఏళ్ల క్రితం మొదటిసారి తనను చూశాను. అది కూడా వెనుకనుంచి మాత్రమే. క్షణంలో 1000వ వంతు సమయంలోనే తను...
06-12-2019
Dec 06, 2019, 11:40 IST
మేషం : మీ ప్రేమ ప్రతిపాదనలు అత్యంత ఇష్టులైన వారికి అందించేందుకు ఆది, సోమవారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ...
06-12-2019
Dec 06, 2019, 10:33 IST
నేను పది నెలల క్రితం మా ఫ్రెండ్‌తో కలిసి మా రిలేటివ్‌ ఎంగేజ్‌మెంట్‌కి వెళ్లాను. అక్కడ మొదటిసారి సాయి పవన్‌ను...
05-12-2019
Dec 05, 2019, 16:29 IST
సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చి హాస్టల్‌లో జాయిన్‌ అయ్యాను. ఓ రోజు చల్లని సాయంకాలం వేళ హాస్టల్‌పైకి వెళ్లాను....
05-12-2019
Dec 05, 2019, 15:09 IST
నేనో పిచ్చోడిలా బ్రతుకుతున్నా. ప్రపంచం నానుంచి...
05-12-2019
Dec 05, 2019, 11:50 IST
ప్రేమలో పడనంత వరకు ఒకలా ఉంటారు. ప్రేమలో పడిన తర్వాత..
05-12-2019
Dec 05, 2019, 10:26 IST
నేను ఇంటర్మీడియట్ వరుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఫ్రెండ్స్, మూవీస్ అని ఎంజాయ్ చేశాను.  డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక అమ్మాయిని చూశాను. ఏదో తెలియని క్రష్....
04-12-2019
Dec 04, 2019, 16:38 IST
అది 2003! అప్పుడప్పుడే ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ ఓటమి బాధలోనుంచి బయటకొస్తున్న రోజులు. నేను ఆరవ తరగతి వరకు ఒక స్కూల్లో చదువుకుని...
04-12-2019
Dec 04, 2019, 15:09 IST
నలుగురితో నాలుగు సార్లు లవ్‌లో పడ్డా. ఇప్పుడు...
04-12-2019
Dec 04, 2019, 11:56 IST
అందంగా ఉన్నావారి కంటే...
04-12-2019
Dec 04, 2019, 10:28 IST
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు, ఎప్పుడో అప్పుడు పరిచయం అవుతారు. ఆ పరిచయాలు స్నేహాలుగా,...
02-12-2019
Dec 02, 2019, 16:34 IST
ఎలా వచ్చిందో తెలియదు కానీ, నా జీవితంలోకి వెలుగులా వచ్చింది తను. అప్పటికే లవ్‌ ఫేయిల్యూర్‌ అయి అంధకారంలో ఉన్న నన్ను తను...
02-12-2019
Dec 02, 2019, 15:08 IST
ఓ రాంగ్‌ కాల్‌ ద్వారా తను నాకు పరిచయం అయ్యింది. వాట్సాప్‌లో తొమ్మిది రోజులు చాట్‌ చేసుకున్నాం. ఫ్రెండ్స్‌ కూడాఅయ్యాం....
02-12-2019
Dec 02, 2019, 11:51 IST
ఈ సృష్టిలో ఏ ఇద్దరి మనస్తత్వాలు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండవు. ఇలాంటి సమయంలో ఓ అమ్మాయి.. అబ్బాయి ప్రేమలో పడి అతడి...
02-12-2019
Dec 02, 2019, 10:20 IST
నాతో బాగా మాట్లాడింది. నాకేం తెలియదు అన్నట్లు చాట్‌ చేసింది. నేను డైరెక్ట్‌గా..
01-12-2019
Dec 01, 2019, 16:34 IST
నేను పదవ తరగతి చదివేటప్పుడు ఒక అమ్మాయిని లవ్‌ చేశా. ఆమె అంటే నాకు ప్రేమ.. ఆకర్షణ ఏదో తెలియదు....
01-12-2019
Dec 01, 2019, 15:10 IST
నేనో మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిని. చిన్నప్పటినుంచి అమ్మానాన్న లేకపోవటం వల్ల చుట్టాల ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వారి అరకొర ప్రేమతో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top