ఇలాంటోళ్లు రొమాన్సులో పిచ్చోళ్లు!  | Sakshi
Sakshi News home page

ఇలాంటోళ్లు రొమాన్సులో పిచ్చోళ్లు! 

Published Mon, Dec 23 2019 12:12 PM

Non Romantic Persons Behaviour In A Relationship - Sakshi

‘ప్రియురాలి ముందు ధైర్యంగా మాట్లాడటానికి ఇబ్బందిపడేవాడే ప్రేమికుడు.’ అంటాడు ప్రముఖ ఆంగ్ల రచయిత టీఎస్‌ ఎలైట్‌. ఇది కొంతమంది ప్రేమికుల విషయంలో కచ్చితంగా వర్తిస్తుంది. కేవలం మాటల్లోనే కాదు! ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టే చిన్న చిన్న పనుల విషయంలోనూ కొంతమంది తడబడుతుంటారు. వీళ్లు రొమాన్స్‌లో ఏబీసీడీలు రాని పిచ్చోళ్లు. దీని వల్ల రిలేషన్‌షిప్‌ దెబ్బతింటుందని చెప్పలేము కానీ, ఇలాంటోళ్లు ఎదుటి వ్యక్తిని పూర్తిస్థాయిలో సంతోషపెట్టలేరన్నది నిజం. అయితే ఏ ఏ విషయాల్లో.. ముఖ్యంగా రొమాన్స్‌లో వెనుకబడి ఉన్నవాళ్లు ఎలా ఆలోచిస్తారో తెలుసుకుందాం!

1) ప్రాక్టికల్‌ ఆలోచన : ప్రియురాలి పుట్టిన రోజు నాడు రోజాపూలతో ఆమెను విష్‌ చేయకుండా.. రోజాపూలు ఎందుకు దండగ. వాటికోసం చేసే ఖర్చుతో వేరే అవసరమైన వస్తువు కొని ఇస్తే బాగుంటుంది కదా అని ఆలోచించటం. లేకపోతే పూల స్థానంలో పండ్లో, కూరగాయలో ఇద్దామనుకోవటం.

2) పబ్లిక్‌ స్పేస్‌ : రొమాంటిక్‌ కపుల్‌ ముఖ్య లక్షణం తమ చుట్టూ ఎంతమంది జనం ఉన్నా ధైర్యంగా కబుర్లు చెప్పుకోవటం, కాస్తంత సరదాగా ఉండటం. కానీ, కొంతమంది జనంలో ఉన్నప్పుడు మొహమాటపడుతుంటారు. అందరిలో ఎదుటివ్యక్తితో  గట్టిగా మాట్లాడటానికి ఆలోచిస్తారు. కలిసి నవ్వటానికి కూడా జంకుతుంటారు. 

3) సొంత కట్టుబాట్లు : ప్రతి మనిషికి కొన్ని కట్టుబాట్లు ఉండటం మామూలే. అయితే మనతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నపుడు కొద్దిగా వాటిలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ‘ఎవరికోసమూ నా కట్టుబాట్లలో మార్పులు చేసుకోను’ అనేవాళ్లు, భాగస్వామి సరదాగా ఎక్కడికైనా బయటకు వెళదామన్నపుడు టైం టేబుల్‌ చూసుకునేవాళ్లు రొమాన్స్‌కు చాలా దూరంగా ఉన్నట్లు అర్థం.

ఇవే కాకుండా భాగస్వామి కౌగిలించుకోవటానికి లేదా ముద్దుపెట్టుకోవటానికి ట్రై చేస్తున్నపుడు భయపడుతూ కొంతమంది వారికి దూరంగా వెళుతుంటారు. అంటే దీనర్థం ఎదుటి వ్యక్తిమీద మీకు ప్రేమలేదని కాదు మీరు రొమాన్సులో వెనుకబడి ఉన్నారని అర్థం. మరికొందరు రిలేషన్‌లో ఉన్నపుడు తమ భాగస్వామిలో ఓ మంచి స్నేహితుడిని వెతుక్కుంటుంటారు. అలాంటి వారు రొమాంటిక్‌ పనులకు చాలా దూరంగా ఉంటారు. మీరు ఇలాంటి రొమాంటిక్‌ పనులకు దూరంగా ఉన్నారంటే బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు! మీరు మిగితా వారికంటే ప్రత్యేకమని గుర్తించండి.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement
Advertisement