నకిలీ బంగారం ముఠా అరెస్ట్‌

Fake Gold Gang Arrested in karimnagar district - Sakshi

కరీంనగర్‌క్రైం: ప్రజలకు నకిలీ బంగారాన్ని అంటగడుతున్న రాజస్థాన్‌కు చెం దిన ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వివరాలను హెడ్‌క్వార్టర్స్‌లో వెల్లడించారు. రాజస్థా న్‌ రాష్ట్రం సిరోహి జిల్లా నరదర గ్రామా నికి చెందిన సోళంకి రమేశ్, రాజుఆకా శ్‌ స్నేహితులు. మొదటగా ఒక ప్రాం తాన్ని ఎంచుకుని నివాసం ఏర్పాటుచేసుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్లాస్టిక్‌ వస్తువులు అమ్మేవారిగా తిరుగుతారు. తమవద్ద పెద్ద ఎత్తున బం గారం ఉందని, తక్కువ ధరకు ఇస్తామ ని నమ్మిస్తారు. ఓచోటు చెప్పి ప్రజలు డబ్బులతో వెళ్లగానే నకిలీ బంగారాన్ని అంటగడతారు. పరీక్షించేలోపు అక్కడి నుంచి జారుకుంటారు. ఇలా కరీంనగర్‌ ముకరంపురకు చెందిన ఓ వ్యక్తికి కిలో బంగారం ఇస్తామని రూ.5లక్షల తో ఉడాయించారు.

ఇలా చిక్కారు..
కరీంనగర్‌కు చెందిన దయ్యాల మల్ల య్య రెండ్రోజుల క్రితం ఆర్టీసీబస్టాండ్‌కు వెళ్లగా అక్కడే ఉన్న రమేశ్, అకాశ్‌ పరిచయం చేసుకున్నారు. తమవద్ద 20తులాల బంగారం ఉందని, మార్కె ట్లో రూ.5లక్షలు పలుకుతుందని, రూ. 50 వేలకే ఇస్తామని చెప్పారు.మల్లయ్య ఇంటికి వెళ్లి డబ్బు తీసుకొచ్చాడు. బం గారం తీసుకుని అది నకిలీగా గుర్తించాడు. వెంటనే టాస్క్‌ఫోర్స్‌ పోలీసు లకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకుని నిందితులను అరెస్ట్‌ చేశారు. వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించి రిమాండ్‌ చేశారు. సీఐలు శ్రీనివా సరావు, కిరణ్, మాధవి ఉన్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top