ఆడుతూనే... 71 కోట్లు సంపాదించేశాడు

YouTube Star kid Ryan in Forbes List - Sakshi

వాషింగ్టన్‌ :  ప్రముఖ సంస్థ ఫోర్బ్స్‌ ఈ ఏడాదికిగానూ ఒక్కో జాబితాను విడుదల చేస్తున్న క్రమంలో యూట్యూబ్‌ ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న స్టార్ల జాబితాలో ఆరేళ్ల చిన్నారి నిలిచి ఆశ్చర్యానికి గురిచేశాడు. కేవలం బొమ్మలతో ఆడుకోవటం ద్వారానే అతను 11 మిలియన్ డాలర్లను(మన కరెన్సీలో సుమారు 71 కోట్లు) సంపాదించాడంటే అతిశయోక్తి కాదు. 

పిల్లలకు బొమ్మలంటే ఇష్టం ఎలాగో ర్యాన్‌కు అంతే.. కాకపోతే అది కాస్త ఎక్కువ. ఒక బొమ్మ అతని చేతికి చిక్కిందంటే దానిని క్షణ్ణంగా పరిశీలిస్తాడు. అదేంటో.. దాంట్లో ప్రత్యేకతలు ఏంటో పూర్తిగా అధ్యయనం చేసి వివరిస్తుంటాడు. నాలుగేళ్ల వయసులో అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వీడియోలు తీసి.. ర్యాన్‌ టాయ్స్‌రివ్యూ అనే ఓ ట్యూబ్‌ఛానెల్‌ను సృష్టించి అందులో ఆ వీడియోలను అప్‌ డేట్ చేస్తూ వస్తున్నారు. 

ఆ ఛానెల్‌కు కోటి మందికిపైగా సబ్‌ స్క్రైబర్‌లు ఉన్నారు. ర్యాన్‌ వీడియోలను చూసే చాలా మంది చిన్నారులు బొమ్మలు కొంటుంటారు కూడా. వాటి డెమో ఇచ్చే సమయంలో అతని హవాభావాలు భలేగా ఉంటాయి. ఈ వీడియోలను గానూ అతనికి సదరు కంపెనీల నుంచి పెద్ద మొత్తంలోనే ముడుతోంది. ఈ ఏడాదికి గానూ 71 కోట్ల సంపాదనతో యూట్యూబ్‌ స్టార్ల లిస్ట్‌లో 8వ స్థానంలో నిలిచాడు. 

ఇక ఈ జాబితాలో డేనియల్‌ మిడల్టన్‌(16.5 మిలియన్ల డాలర్లతో) ప్రథమ స్థానంలో నిలవగా... ఇవాన్‌ ఫోంగ్‌(వానోస్స్‌ గేమింగ్‌-15.5 మిలియన్ల డాలర్లు), డ్యూడ్‌ ఫర్‌ఫెక్ట్‌(14 మిలియన్లు) నిలిచారు. ర్యాన్‌ టాయ్స్‌రివ్యూ... స్మోష్ స్టార్లు సంయుక్తంగా 8వ స్థానంలో నిలిచారు. ఇదే లిస్ట్‌లో ఇండో-కెనడియన్‌ కమెడియన్‌ లిల్లీ సింగ్‌ పదో స్థానంలో నిలవటం విశేషం.

లిల్లీ సింగ్‌ ఫోటో

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top