
లండన్ : రహదారులు రక్తమోడుతున్నాయి.. అనే శీర్షికలు నేడు ప్రపంచమంతా సహజమయ్యాయి. ప్రతిరోజూ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పరధ్యానంలో డ్రైవింగ్ చేయడం ఒకటి. డ్రైవింగ్ విషయంలో పురుషలకంటే మహిళలే బెటరని తాజాసర్వే ఒకటి స్పష్టం చేసింది. మహిళల డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతున్నాయని కూడా సర్వే ప్రకటించింది.
పురుషులతో పోలిస్తే మహిళలు ఏకాగ్రతగా, ఆందోళన లేకుండా, మనసును స్థిమితంగా ఉంచుకుని డ్రైవింగ్ చేస్తారని సర్వే పేర్కొంది. యువకుల వేగంతో ప్రజలు బెంబేలు ఎత్తుతున్నట్లు సర్వే తెలిపింది.
నార్వేకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఎకనామిక్స్ సంస్థ యువతీయువకులు, ఉద్యోగస్తుల డ్రైవింగ్‌పై సర్వే నిర్వహించింది.టీ సర్వేలో డ్రైవింగ్ చేసే సమయంలో వారి మానసిక స్థితి, ఆందోళనలు, రహదారిపై ఏకాగ్రత వంటి అంశాలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మూడింట రెండొంతుల మంది మహిళలు.. తాము డ్రైవింగ్ చేసే అసమయంలో ఎటువంటి ఆందోళనలు పెట్టుకోమని వెల్లడించారు. ఈ సర్వేలోనే మహిళల డ్రైవింగ్‌లో ప్రమాదాలు చాలా తక్కువగా జరిగాయని తేలింది.