ఒక్క కౌగిలి... నేరస్థుడిని మార్చింది..!

Woman hugs, be friends prisoner

స్నేహం మనిషిని మారుస్తుందా? హంతకుడిని మానిషిని చేస్తుందా? ఇటువంటి ప్రశ్నలకు సజీవ సాక్ష్యాలుగా.. ఇయాన్‌ మాన్యుయేల్‌,  డెబ్బీ బెగ్రీ నిలుస్తారు. స్త్రీ పురుష సంబంధాలు బలహీనమవుతున్న ఈ కాలంలో స్నేహం విలువను కాపడడమేకాక కొత్త విలువలు చాటారు. వీరిద్దరి గురించి చెప్పుకోవాలంటే దాదాపు రెండున్నర దశాబ్దలు వెనక్కు వెళ్లాలి.

అది 1991 సంవత్సరం. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతం. నిత్యం రద్దీగా ఉండే పార్క్‌ ఏరియా. అక్కడ తన ఇద్దరు పిల్లలతో కలిసి డెబ్బీ (28)  అక్కడకు వచ్చింది. అంతలోనే దారి దోపిడీ చేసేందుకు 13 ఏళ్ల ఇయాన్‌ మాన్యుయేల్‌ అక్కడకు వచ్చాడు. చూస్తున్నంతలోనే ఇయాన్‌ చేతిలోని తుపాకి బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. డెబ్బికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఇయాన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చారు. దోపిడీ, హత్యా నేరాలపై విచారణ జరిపిన కోర్టు.. ఇయాన్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. శిక్ష పడే నాటికి ఇయాన్‌కు 14 ఏళ్లు మాత్రమే.

చిన్న వయసులోనే జీవితం జైలుకు అంకితం కావడంతో ఇయాన్‌ విలవిల్లాడాడు. ఏడాది తరువాత పశ్చాత్తాపం మొదలై.. డెబ్బీతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. మొదట్లో ఇయాన్‌తో మాట్లాడేందుకు డెబ్బీ అంగీకరించలేదు. అయితే ఇయాన్‌ పట్టుదల చూసి క్షమించి అతనితో మాట్లాడడం మొదలు పెట్టింది. ఇది క్రమంగా స్నేహంగా మారింది. ఆ తరువాత ఈ స్నేహం మరింత గట్టిపడింది. ఇక్కడ నుంచే కథ మరో మలుపు తిరిగింది. ఇయాన్‌ను విడిపిచడం కోసం డెబ్బీ.. ఈక్వల్‌ జస్టిస్‌ ఇన్షియేటివ్‌ సంస్థను కలిసింది. ఆ సంస్థ లాయర్‌ బ్రెయాన్‌ స్టావెన్‌సన్‌.. ఇయన్‌ తరఫున వాదించేందుకు అంగీకరించాడు. వాదనలు.. ప్రతివాదనలు సుదీర్ఘంగా సాగాయి. చివరకు ఇయాన్‌కు క్షమాభిక్ష పెట్టేందుకు కోర్టు అంగీకరించింది. చిట్టచివరకు ఇయాన్‌ 39 ఏళ్ల వయసులో జైలు నుంచి 2016 ఆఖరులో విడుదల అయ్యారు.

జైలు నుంచి విడుదల అయిన తరువాత కూడా ఇయాన్‌-డెబ్బీలు తమ పవిత్ర స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇయాన్‌ నా పిల్లలతో సమానం అంటోంది డెబ్బీ. ఈ పరిణామాల క్రమాన్ని ఇద్దరు కలసి ఒక వీడియో రూపొందించి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top