
గెలుపెవరిది?
సాధారణంగా ఈ రెండింటికి గొడవ జరగదు.. ఒకవేళ జరిగితే.. రెండూ ముష్టి యుద్ధానికి దిగితే గెలుపెవరిదో? ప్రస్తుతానికి ఈ ఫొటో చూస్తుంటే మాత్రం జాగ్వార్ (పులుల జాతికి చెందినది) గట్టి పట్టే పట్టినట్లు కనిపిస్తోంది.
సాధారణంగా ఈ రెండింటికి గొడవ జరగదు.. ఒకవేళ జరిగితే.. రెండూ ముష్టి యుద్ధానికి దిగితే గెలుపెవరిదో? ప్రస్తుతానికి ఈ ఫొటో చూస్తుంటే మాత్రం జాగ్వార్ (పులుల జాతికి చెందినది) గట్టి పట్టే పట్టినట్లు కనిపిస్తోంది. చివరికి ఏది గెలిచిందో తెలియదు గానీ.. ఈ ఫొటో తీసిన జస్టిన్ బ్లాక్ (అమెరికా)కు మాత్రం బోలెడంత పేరొచ్చేసింది. నేషనల్ హిస్టరీ మ్యూజియంతో కలసి బీబీసీ వారు నిర్వహిస్తున్న వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2014లో పీపుల్స్ చాయిస్ అవార్డు కోసం పోటీ పడే ఫొటోల తుది జాబితాకు ఈ చిత్రం ఎంపికైంది. ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అక్టోబర్ 21న విజేతను ప్రకటిస్తారు.