చైనా పత్రికల పై ఆంక్షలు విధించిన అమెరికా

US Impose Constraints On 4 China News Companies - Sakshi

వాషింగ్టన్‌: చైనాకు చెందిన మరో నాలుగు మీడియా సంస్థల మీద అమెరికా ఆంక్షలు విధించింది. వాటిని విదేశీ మిషన్లగా పేర్కొంది. చైనా అధ్యక్షుడు మీడియాపై కఠినమైన నియంతృత్వ విధానాలు అమలుచేస్తుండటంతో దానికి ప్రతీకరంగా అమెరికా ఈ చర్యలకు ఉపక్రమింనట్లు తెలుస్తోంది. ఈ నాలుగు సంస్థల  వారిని చైనాదేశానికి చెందిన ప్రతినిధులుగా భావిస్తారు. వారి వీసాలకు సంబంధించిన విషయాలు, ఆ‍స్తులకు సంబంధించిన విషయాల మీద కూడా ఆంక్షలు విధించారు. (చైనా జనరల్ ఆదేశంతోనే భారత్ పై దాడి!)

చైనా సెంట్రల్‌ టెలివిజన్‌, ది పీపుల్స్‌ డైలీ, చైనా న్యూస్‌ సర్వీస్‌, గ్లోబల్‌ టైమ్స్‌ పత్రికలపై ఆంక్షలు విధించినట్లు ఈస్ట్‌ ఏసియా స్టేట్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ డెవిడ్‌ స్టిల్‌వెల్‌ తెలిపారు. ప్రతికలపై ఇలాంటి చర్యలు  తీసుకోవడం పత్రిక స్వేచ్ఛను హరించడమే విమర్శలు వెల్లువెత్తుతుండగా వాటిని అమెరికా ఉన్నతాధికారులు ఖండించారు. అయితే ఈ ఆంక్షల కారణంగా ఆ పత్రికల్లో పనిచేసే వారు ఉపాధి కోల్పోనున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభించడానికి చైనానే  కారణంమంటూ ఆ దేశానికి చెందిన వార్తసంస్థల మీద ఫిబ్రవరిలోనే ట్రంప్‌ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.  

(కరోనా వైరస్‌: ఇక చైనా మారదు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top