అందంగా ఉన‍్నావంటూ ‘ఆమె’కు ఫైన్‌

Uruguay Traffic Police Fined A Driver For Circling With Excess Beauty - Sakshi

హెల్మెట్‌ పెట్టుకోలేదని, సీటు బెల్టు పెట్టుకోలేదని, బైక్‌పై ముగ్గురు వెళుతున్నారని, రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారని ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ వేస్తారు. అది ఎక్కడైనా సహజమే. కానీ ఉరుగ్వేలో బైక్‌పై వెళుతున్న ఓ అమ్మాయికి ఫైన్‌ వేశారు. ఇంతకీ చలానా ఎందుకు వేసారో తెలుసా...ఆమె చాలా అందంగా ఉందని!. నోరెళ్లపెట్టకండి. మే 25న పేసందు అనే పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అంతేకాదు చలానాను చించి ఇచ్చాడు. పైగా దానిపై ‘చాలా అందంగా ఉండి పబ్లిక్‌ రోడ్డుపై వెళ్తుందుకు ఫైన్‌ కట్టండి’ అంటూ ట్రాఫిక్‌ పోలీస్‌ రాసిచ్చాడు.

అందంగా ఉన్నవారికి ఫైన్‌ వేయాలని ఏమైనా చట్టం ఉందా అంటే అదీ లేదు. ఇంతకీ ఆ ఫైన్‌ ఎందుకు వేశాడో తెలుసా. ఆ యువతిని చూడగానే ఆ పోలీస్‌ మనసు పారేసుకున్నాడు. వెంటనే ఆమెను ఆకట్టుకునేందుకు ఇదో ట్రిక్‌గా భావించాడు. ఆ చాలాన చివరలో ఐ లవ్‌ యూ అని కూడా రాశాడు. అయితే అది పెద్ద వివాదాస్పదమైంది. అధికారిక చలానాలను సొంత వ్యవహారాల కోసం వాడుకున్నందుకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మనోడి మన్మథ కళలకు ఉద్యోగం ఊడేలా ఉందిప్పుడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top