గే వివాహం చేసుకోబోతున్న మంత్రి | UK minister comes out as gay after 29-year secret affair | Sakshi
Sakshi News home page

గే వివాహం చేసుకోబోతున్న మంత్రి

Jun 6 2015 7:06 PM | Updated on Sep 3 2017 3:19 AM

బ్రిటన్ పాఠశాల విద్యా శాఖ మంత్రి నిక్ గిబ్ గే వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించారు.

లండన్: బ్రిటన్ పాఠశాల విద్యా శాఖ మంత్రి నిక్ గిబ్ గే వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించారు. గిబ్.. పాపులస్ పోలింగ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల్ సిమండ్స్ను పెళ్లాడనున్నట్టు చెప్పారు. 29 ఏళ్లుగా వీరిద్దరూ రహస్యంగా సహజీవనం చేస్తున్నారు. తామిద్దరం అందమైన జీవితాన్ని ఆస్వాదించామని గిబ్ చెప్పారు. సిమండ్స్, తాను ప్రేమలో పడ్డామని, ఇద్దరూ కలసిమెలసి జీవించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ విషయం తెలిసి తన తల్లి తొలుత షాకయ్యారని, తర్వాత అర్థం చేసుకుని ఆశీర్వదించారని చెప్పారు. తమ పెళ్లికి 79 ఏళ్ల తల్లిని, మరికొంతమంది బందువులను ఆహ్వానించినట్టు గిబ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement