ట్రంప్‌ కాక్‌టెయిల్‌, కిమ్‌ వోడ్కా

Trump Cocktails Kim Tacos In Singapore - Sakshi

సింగపూర్‌ : ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా- ఉత్తరకొరియా దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ భేటి సింగపూర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చారిత్రక భేటిని సింగపూర్‌ రెస్టారెంట్లు, బార్లు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఉత్తర, దక్షిణ దృవాల్లా ఉన్న ట్రంప్‌-కిమ్‌ల సమావేశం అక్కడి జనాల్లో కూడా ఆసక్తి రేపుతుంది. అయితే ఈ ఆసక్తిని గమనించిన రెస్టారెంట్‌ యజమానులు ట్రంప్‌-కిమ్‌ పేర్లతో కొత్త వంటకాలు తయారుచేసేస్తున్నారు. అలాగే కాక్‌టెయిల్‌కు ట్రంప్‌ కాక్‌టెల్‌ అని, టాకోస్‌కు కిమ్‌ టాకోస్‌ అని పేర్లు పెట్టేశారు. పైగా వాటిని కేవలం నీలం, ఎరుపు రంగులలోనే తయారు చేస్తున్నారు. అవి ఆ రెండు దేశాల జెండా రంగులను సూచిస్తాయి.

కస్టమర్లు కూడా వీటిని విపరీతంగా ఆదరిస్తున్నారు. అలాగే అమెరికా వంటకాలను, కొరియా వంటకాలను కలిపి ‘ట్రింప్‌-కిమ్‌ చీ నాసి లెమ్‌క’ పేరుతో ఒక కొత్త రకం వంటకాన్ని తయారుచేశారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విపరీతంగా ప్రస్తావించిన నినాదం ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగెయిన్‌’ నినాదాన్ని కూడా వాడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భేటిపై సానుకూల ప్రభావం ఉంటుందని అక్కడి రెస్టారెంట్‌ యజమానులు చెబుతున్నారు. ఇది ఒక జిమ్మిక్‌ అని అన్నారు. బార్లు, పబ్బుల్లో అయితే ట్రంప్‌ కాక్‌టెయిల్‌ పేరుతో అమెరికా దేశపు జెండా రంగులతో తయారుచేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. అలాగే కిమ్‌ వోడ్కా పేరుతో మందు ప్రియులకు అందిస్తున్నారు. సాధారణంగా కొరియన్లు మందు ప్రియులు కాబట్టి ఈ కొత్త రకం వోడ్కాకు గిరాకీ బాగానే ఉంటుందని అంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top