ఐసిస్‌లోకి ఏయే దేశాల నుంచి రిక్రూట్‌మెంట్స్? | the secret behind joining in ISIS | Sakshi
Sakshi News home page

ఐసిస్‌లోకి ఏయే దేశాల నుంచి రిక్రూట్‌మెంట్స్?

Jul 4 2016 2:40 PM | Updated on Sep 4 2017 4:07 AM

ఐసిస్‌లోకి ఏయే దేశాల నుంచి రిక్రూట్‌మెంట్స్?

ఐసిస్‌లోకి ఏయే దేశాల నుంచి రిక్రూట్‌మెంట్స్?

ఇరాక్, సిరియా దేశాల్లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో ఆవిర్భవించిన ఐసిస్ టెర్రరిస్టు సంస్థలోకి ఏ దేశాల నుంచి ఎక్కువమంది విదేశీ ఫైటర్లు చేరుతున్నారు?

ఇరాక్, సిరియా దేశాల్లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో ఆవిర్భవించిన ఐసిస్ టెర్రరిస్టు సంస్థలోకి ఏ దేశాల నుంచి ఎక్కువమంది విదేశీ ఫైటర్లు చేరుతున్నారు? ఎందుకు చేరుతున్నారు? వారు చేరడం వెనుకనున్న సామాజిక పరిస్థితులు ఏమిటి? అన్న అంశాలు ఇస్తాంబుల్, బాగ్దాద్ నరమేధం నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశాలయ్యాయి.

మధ్యప్రాచ్యం, అరబ్ దేశాల నుంచే ఎక్కువ మంది విదేశీ ఫైటర్లు ఐసిస్‌లో చేరుతున్నా, ఐరోపా కూటమి దేశాలతో పాటు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి పాశ్చాత్య దేశాలే కాకుండా రష్యా, ఇండోనేషియా, తజకిస్థాన్ లాంటి దేశాల నుంచి కూడా వేలాది మంది విదేశీ ఫైటర్లు చేరుతున్నారు. 2015, డిసెంబర్ నాటికి దాదాపు 85 దేశాల నుంచి 30 వేల మంది విదేశీ ఫైటర్లు ఐసిస్ టెర్రరిస్టు సంస్థలో చేరారు.

ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తక్కువగా ఉన్న  దేశాల నుంచే విదేశీ ఫైటర్లు చేరుతున్నందున ఆర్థిక పురోభివృద్ధికి, వారు టెర్రరిజాన్ని ఆశ్రయించడానికి సంబంధం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆర్థికాభివృద్ధితోపాటు రాజకీయంగా బలంగా ఉండి, భాషాపరంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఎక్కువ మంది టెర్రరిజం వైపు మొగ్గుచూపడం సామాజిక విశ్లేషకులు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వలస వచ్చిన ముస్లింలను చిన్నచూపు చూడడం, సామాజికాభివృద్ధి సూచికలో వారు వెనకబడి ఉండడం కారణాల వల్ల ముస్లిం యువత టెర్రరిజం వైపు మొగ్గుచూపుతోందని ఇంతవరకు భావిస్తూ వచ్చారు. ముస్లింలపట్ల సామాజిక వివక్ష లేని దేశాల నుంచి కూడా ఎక్కువ మంది ఐసిస్ పట్ల ఆకర్షితులవడం కూడా ఆశ్చకరమైన విషయమని వారు భావిస్తున్నారు. సామాజిక అభివృద్ధి సూచికలో కొంత వెనకబాటుతనం పరోక్షంగా కారణం అవుతుండవచ్చని వారు భావిస్తున్నారు. అయితే ఓ దేశ జనాభాలో ముస్లింల సంఖ్యకు, ఐసిస్ సంస్థలో విదేశీ ఫైటర్లు చేరడానికి మాత్రం ప్రత్యక్ష సంబంధం ఉందని వారు చెబుతున్నారు. ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువ మంది చేరుతున్నారని వారంటున్నారు.

సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది విదేశీ ఫైటర్లు ఆకర్షిలవుతున్నారనే విషయం స్పష్టమైనా, అందుకు దారితీస్తున్న సామాజికాంశాలను మాత్రం ఇంకా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతానికి మాత్రం కారణాలు అంతుచిక్కడం లేదని సామాజిక విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement