'స్టీవ్ జాబ్స్ ఐఫోన్ కనిపెట్టలేదు' | Steve Jobs didn’t invent iPhone, says Congresswoman Nancy Pelosi | Sakshi
Sakshi News home page

'స్టీవ్ జాబ్స్ ఐఫోన్ కనిపెట్టలేదు'

Jun 12 2016 8:20 PM | Updated on Mar 18 2019 7:55 PM

ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఐ-ఫోన్ ను కనిపెట్టలేదని కేవలం దాని డిజైన్ రూపొందించారని అమెరికా హోస్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ లో మైనారిటీలకు లీడర్ గా వ్యవహరిస్తున్న నాన్సీ పెలోసీ అన్నారు.

ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఐఫోన్ కనిపెట్టలేదని కేవలం దాని డిజైన్ మాత్రమే రూపొందించారని అమెరికా ప్రతినిధుల సభలో మైనారిటీలకు లీడర్ గా వ్యవహరిస్తున్న నాన్సీ పెలోసీ అన్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(జీపీఎస్), డిజిటల్ కెమెరాలను ఫెడరల్ రీసెర్చ్ రూపొందించిందని, వాటన్నింటిని ఆపిల్ గుదిగుచ్చి ఐఫోన్ ను తయారు చేసిందని డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ ప్లాట్ ఫాంలో వ్యాఖ్యానించారు.

జీపీఎస్, ఫ్లాట్ స్క్రీన్, ఎల్ఎల్ డీ, డిజిటల్ కెమెరా, వైర్ లెస్ డేటా కంప్రషన్, వాయిస్ రికగ్నిషన్ తదితర టెక్నాలజీలను మొత్తం ఫెడరల్ రీసెర్చ్ నుంచే తీసుకున్నట్లు తెలిపారు. వీటన్నింటికి ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా, నేడు పెద్ద దిగ్గజాలుగా రాణిస్తున్న కంపెనీలు అన్నీ ఫెడరల్ రీసెర్చ్ నుంచి టెక్నాలజీని తీసుకున్నవేనని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement