తెల్లజుట్టు, బట్టతలకు కారణమేంటో తెలిసింది! | Scientists Discover White Hair Turns Gray and Goes Bald | Sakshi
Sakshi News home page

తెల్లజుట్టు, బట్టతలకు కారణమేంటో తెలిసింది!

Published Tue, May 9 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

తెల్లజుట్టు, బట్టతలకు కారణమేంటో తెలిసింది!

 
న్యూయార్క్‌:
చిన్నవయసులోనే జుట్టు తెల్లబడటం, బట్టతల రావడం ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. అయితే ఈ రెండు సమస్యలకు కారణమేంటో శాస్త్రవేత్తలు గుర్తించారు. కేఆర్‌ఓఎక్స్‌20 అనే ప్రొటీన్‌ జుట్టు పెరుగుదల కారకంగా పనిచేస్తే, మూల కణకారకం (ఎస్‌సీఎఫ్‌) జుట్టుకి మంచి రంగును ఇస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన సౌత్‌వెస్ట్రన్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు గుర్తించారు.

సాధారణంగా ఇవి రెండూ ఉంటేనే జుట్టు మంచి రంగుతో, ఒత్తుగా పెరుగుతుంది. దీనిని నిర్ధారించుకోవడం కోసం శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన చేశారు. మొదట వారు కేఆర్‌ఓఎక్స్‌20 ప్రోటీన్‌ను ఓ చిట్టెలుక కణాలనుంచి తొలగించారు. వెంటనే దాని జుట్టుపెరుగుదల ఆగిపోయింది. తరువాత వారు మూలకణ కారకాన్ని తొలగించడంతో చిట్టెలుక జుట్టు రంగు  తెల్లగా మారింది. దీన్ని బట్టి ఈ రెండు కారకాలపైనే జుట్టుపెరుగుదల, రంగు ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement