ఫేస్‌బుక్‌లో మోదీనే టాప్‌

PM Narendra Modi​ twice as popular on Facebook as US President ​Trump - Sakshi

అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని

రెండో స్థానంలో ట్రంప్‌

జెనీవా: ఫేస్‌బుక్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజా దరణ పొందిన నేతగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే రెండు రెట్లు ఎక్కువ ఫాలోవర్లతో తొలిస్థానం సాధించారు. ఫేస్‌బుక్‌లో మొత్తంగా 4.32 కోట్ల మంది మోదీని ఫాలో అవుతున్నారు. 2.31 కోట్ల మంది ఫాలోవర్లతో ట్రంప్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ట్వీటర్‌లో మాత్రం ట్రంప్‌ టాప్‌లో ఉన్నారు. బుర్సన్‌ కోన్, వోల్ఫీ సంస్థ ‘ఫేస్‌బుక్‌లో ప్రపంచ నేతలు’ పేరుతో నిర్వహించిన సర్వే వివరాలను ఈ మేరకు వెల్లడించింది.

2017 జనవరి 1వ తేదీ నుంచి దేశాధినేతలు, ప్రభుత్వాలు, విదేశాంగ మంత్రులకు సంబంధించిన సుమారు 650 పేజీల్లోని డేటాను విశ్లేషించినట్లు తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు నరేంద్ర మోదీ ఫేస్‌బుక్‌ పేజీపై 11.36 కోట్ల ఇంటరాక్షన్లు జరిగినట్లు (మొత్తం కామెంట్లు, లైకులు, షేర్లు ఆధారంగా) వివరించింది. అదే డొనాల్డ్‌ ట్రంప్‌ ఫేస్‌బుక్‌ పేజీపై మాత్రం 20.49 కోట్ల ఇంటరాక్షన్లు జరిగినట్లు పేర్కొంది. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఫేస్‌బుక్‌ పేజీపై 4.6 కోట్లు, కాంబోడియా ప్రధాని శామ్‌డెక్‌ హున్‌ సేన్‌ పేజీపై 3.6 కోట్లు, అర్జెంటీనా అధ్యక్షుడు 3.34 కోట్ల ఇంటరాక్షన్లు జరిగినట్లు వెల్లడించింది.

ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న 91 శాతం దేశాలకు అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ఉంది. మొత్తం 193 దేశాలకు గాను 175 దేశాలు ఖాతా నిర్వహిస్తున్నాయి. ఇవికాక 109 దేశాల అధినేతలు, 86 దేశాల ప్రభుత్వ అధినేతలు, 72 మంది విదేశాంగ మంత్రులు వ్యక్తిగతంగా ఫేస్‌బుక్‌ పేజీలు వినియోగిస్తున్నారు. ప్రపంచ నేతల్లో ఎక్కువ మంది వీడియోలను షేర్లు చేయడానికి, ప్రజలతో లైవ్‌లో మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సర్వే తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top