పొట్టలో పెరుగుతున్న ప్లాస్టిక్‌

Plastic ingestion by people could be equating to a credit card - Sakshi

సింగపూర్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి సగటున వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్‌ను పొట్టలోకి పంపించేస్తున్నాడు. అంటే క్రెడిట్‌ కార్డుతో సమానమైన ప్లాస్టిక్‌ను వారంవారం మనిషి పలు రూపాల్లో తినేస్తున్నాడు. అంటే మనిషి తినే, తాగే పదార్థాల ద్వారా ప్లాస్టిక్‌ భూతం పొట్టలో పేరుకుపోతోంది. ఇదే విషయమై ఎంత పరిమాణంలో ప్లాస్టిక్‌ను తింటున్నామో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాలోని న్యూకాసిల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు.

దీనిలో భాగంగా తాగునీరు, షెల్‌ ఫిష్, తేనే వంటి ఆహార పదార్థాల్లో ఎంతమేర సూక్ష్మ స్థాయి ప్లాస్టిక్‌ కణాలు ఉన్నాయో పరిశీలించారు. దీని ప్రకారం మనిషి వారంలో 5 గ్రాముల మేర ప్లాస్టిక్‌ను మింగేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇదే ఫైనల్‌ అయ్యే అవకాశం లేదని, ఇంతకంటే ఎక్కువే ప్లాస్టిక్‌నే మనిషి తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఎందుకంటే కేవలం కొన్ని పదార్థాల్లోని ప్లాస్టిక్‌ను మాత్రమే తాము పరిశీలించామని, ప్యాకేజి ఆహారం, ఇతర మార్గాల్లో తీసుకునే పదార్థాలను తాము అధ్యయనం చేయలేదని తెలిపారు. కేవలం వారంలోనే 5 గ్రాములు తింటుంటే.. నెల, సంవత్సరం, దశాబ్దం.. ఇక జీవిత కాలంలో ఎంత మేర ప్లాస్టిక్‌ను తినాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top