జాగ్రోస్‌ పర్వతాల్లో కూలిన విమానం

Plane with 66 persons on board crashes into Zagros mountains - Sakshi

టెహ్రాన్‌, ఇరాన్‌ : ఇరాన్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 66 మంది ప్రయాణీకులతో రాజధాని టెహ్రాన్‌ నుంచి యాసూజ్‌ నగరానికి వెళ్తున్న విమానం జాగ్రోస్‌ పర్వతాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 66 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏస్‌మ్యాన్‌ విమానయాన సంస్థకు చెందిన విమానం 66 మందితో టెహ్రాన్‌ నుంచి యాసుజ్‌కు బయల్దేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సెమిరోమ్‌ కొండప్రాంతంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఇరాన్‌ స్టేట్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ విమానం కోసం వెతుకులాట ప్రారంభించగా.. ఇసఫాన్‌ ప్రావిన్సుకు దక్షిణాన గల జాగ్రోస్‌ పర్వత ప్రాంతంలో కూలిపోయినట్లు తెలిసింది. 

మృతుల్లో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు ఏస్‌మ్యాన్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రత్యక్ష సాక్షుల చెబుతున్న వివరాల ప్రకారం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు యత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top