
వేళ్ల నుంచి జాలువారింది!
తడి పేరు ఫబియాన్ గ్యేట్. వయసు 43 ఏళ్లు. ఉండేది చిలీలోని ప్యూర్టో మాంట్‌లో. ఇతడి ప్రత్యేకత ఏంటంటే.. వేళ్లనే కుంచెగా మలిచి అద్భుత చిత్రాలను అలవోకగా గీసేయడం.
ఇతడి పేరు ఫబియాన్ గ్యేట్. వయసు 43 ఏళ్లు. ఉండేది చిలీలోని ప్యూర్టో మాంట్‌లో. ఇతడి ప్రత్యేకత ఏంటంటే.. వేళ్లనే కుంచెగా మలిచి అద్భుత చిత్రాలను అలవోకగా గీసేయడం. అది కూడా కేవలం మూడు నిమిషాల్లోపే ముగించేయడం. గ్లాస్ ప్యానెల్స్, ఆయిల్ పెయింట్స్‌తో ఉన్న ఓ సూట్‌కేసుతో ఇక్కడి వీధుల్లో దర్శనమిస్తుంటాడు. ఎవరైనా పెయింటింగ్ వేయమని కోరితే, వారి ముందే చకచకా మూడే నిమిషాల్లో గ్లాస్ ప్యానెల్‌పై అందమైన చిత్తరువును అలవోకగా గీసి ఇచ్చేస్తాడు. ఇలా ఒక్కో చిత్రానికి దాదాపు రూ.500 తీసుకుంటాడు